ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అదృశ్యం: ఇంట్లో సూసైడ్ లేఖ

సంగారెడ్డి: అప్పులబాధలను తట్టుకోలేక ఓ కుటుంబం ఇల్లు వదిలి మాయమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు శ్రీకాళహస్తి వెళ్తున్నామని చెప్పి కనిపించుకుండా పోయారు. మెదక్ జిల్లా ఆమీన్‌పూర్ పంచాయతీ పరిధిలోని లింగమయ్యకాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Seven members of a family missing in Medak district

భీమయ్య(54)కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు అంజలికి వివాహమైంది. భీమయ్య కుటుంబం అప్పులఊబిలో చిక్కుకున్నది. దీంతో భీమయ్య,భార్య నాగమణి(45), కొడుకులు అనిల్ (30), హనుమాండ్లు(27), కోడలు సురేఖ (25),అనిల్ పిల్లలు అయుష్(6),ఆకాశ్(4)తో కలిసి ఈ నెల 16న శ్రీకాళహస్తికి వెళ్తున్నామని ఇరుగుపొరుగుకు చెప్పారు.

నాలుగు రోజులు గడిచినా తిరిగి రాలేదు. భీమయ్య కూతురు కుటుంబసభ్యులందరికీ ఫోన్లు చేసినా కలువలేదు. అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా మాకు అప్పులయ్యాయి. ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్య చేసుకుంటామని రాసి ఉన్న పేపర్‌ను గుర్తించి పోలీసులకు అందజేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+