వివిధ రాష్ట్రాల యువతులతో ‘ఆన్‌లైన్’ సెక్స్ రాకెట్: నిర్వాహకురాలి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మహిళలను బలవంతంగా వ్యభిచారం ఊబిలోకి దింపుతున్న ముఠాను కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు వ్యభిచార ముఠాలను అరెస్ట్ చేసినప్పటికీ.. నగరంలో ఏదో ఒక మూల ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు.. తాజా కొండాపూర్‌లో కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. మహిళా నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) గత కొంత కాలంగా కొండాపూర్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. సాయిప్రతాప్ అపార్ట్‌మెంట్‌లో కొనసాగుతున్న వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ మహిళ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని వివిధ రాష్ట్రాల నుండి అందమైన అమ్మాయిలను తీసుకునివచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని వారు పోలీసులకు చెప్పారు. రోజూ ఆ ప్రాంతానికి కొత్తకొత్త వాళ్లు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో అందర్నీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ. 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications