విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వార్డెన్ భర్త, విచారిస్తున్న పోలీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

దేవరకొండ:నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నేరేడుగొమ్మ ఆశ్రమ పాఠశాలలో విధ్యార్థినులను హస్టల్ వార్డెన్ భర్త రాజు లైంగికంగా వేధిస్తున్నాడని విధ్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు.ఈ విషయమై విధ్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాద చేశారు.

దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్మ ఆశ్రమపాఠశాలను తనిఖీ చేసేందురకుగాను ఏటిడబ్ల్యుఓ పాండునాయక్ ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. అయితే వార్డెన్ భర్త రాజు తమను లైంగికంగా వేధిస్తున్నాడని విధ్యార్థినులు ఫిర్యాదు చేశారు.

sexual harassement in neredugomma girls hostel

అయినా ఏటిడబ్ల్యూఓ ఏ మాత్రం స్పందించకపోవడంతో విధ్యార్థినులు ఓ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుల దృస్టికి తీసుకెళ్ళారు. వేసవి కాలం కావడంతో ఈ గదిలో మీకు ఉక్కపోస్తోంది.తన గదిలోకి వస్తే చల్లటిగాలి వస్తోందని తన గదిలోకి రమ్మని వేధిస్తున్నాడని ఆరోతరగతి చదివే ఓ బాలిక ఫిర్యాదు చేసింది.

వారం రోజుల క్రితం ఇరవై రూపాయాలు ఇచ్చిన వార్డెన్ భర్త రాజు తనకు ముద్దుపెట్టాలని వేధించి ముద్దుపెట్టించుకొన్నాడని చెప్పింది.విషయం తెలుసుకొన్న ఆశ్రమ నిర్వహకులు శనివారం నాడు ఆశ్రమ పాఠశాలకు వచ్చి విచారణ జరపడంతో విధ్యార్థినులు తాము పాఠశాలలో అనుభవిస్తున్న దారుణాలను సదరు స్వచ్చంధసంస్థ నిర్వాహకులకు చెప్పారు.

స్వచ్చంధసంస్థ నిర్వాహకులు శనివారం నాడు వార్డెన్ భర్త రాజుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ విషయమై స్వచ్చంధసంస్థ ఉద్యోగి కె.లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా దేవరకొండ రూరల్ సిఐ వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
sexual harassement in neredugomma girls hostel.students complaint against hostel warden vijayarani husband raju.police registered a case.
Please Wait while comments are loading...