హైదరాబాద్‌కు విఘాతం: కెసిఆర్‌పై శంకర్రావు
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సీమాంధ్ర ప్రముఖల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
సీమాంధ్రకు చెందిన ప్రముఖుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. తెలుగువారి మధ్య విద్వేషాలు మంచిది కాదని శంకర్రావు హితవు పలికారు.

కెసిఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ
కరీంనగర్: తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారని, ఇందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. నగరాల్లో కూడా నాలుగు నుంచి ఆరు గంటలపాటు కోతలు విధిస్తున్నారని అన్నారు.
సాధారణంగా ఇళ్లలో జరుపుకోవాల్సిన పండగలను అధికారికంగా నిర్వహిస్తూ కెసిఆర్ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ కూటములు కుంభకోణాల్లో కూరుకుపోయాయని ఆరోపించిన ఆయన, దీనిపై అక్టోబర్ 16న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications