శివబాలకృష్ణకు ముగిసిన ఏసీబీ కస్టడీ: రూ. 250 కోట్ల ఆస్తులు, ఏడు ఇళ్లు, వందల ఎకరాలు
హైదరాబాద్: భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడి ముగిసింది. ఎనిమిది రోజులపాటు ఆయనను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ(రెరా)లో పనిచేసిన కాలంలోనూ స్థిరాస్తి సంస్థలకు మంజూరు చేసిన అనుమతుల వ్యవహారంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది.
కస్టడీ ముగిసిన తర్వాత శివబాలకృష్ణను కోర్టు ముందు హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు శివబాలకృష్ణ జ్యుడీషియల్ రిమాండ్ గురువారంతో ముగియనుంది. శివబాలకృష్ణ పేరిట భారీగా ఆస్తులున్నట్లు విచారణలో గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులు, బంధువుల పేరుపైనా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడించారు.

బాలకృష్ణ ఆస్తి మొత్తం రూ.250 కోట్లు ఉంటుందని గుర్తించినట్లు చెప్పారు. బినామీల పేరిట 214 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఆయన పేరు మీద జనగామలో 102 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్లు విచారణలో ఏసీబీ తేలింది.
శివబాలకృష్ణకు రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయనకు ప్రధానంగా ముగ్గురు బినామీలు ఉన్నారు. శివబాలకృష్ణ కుటుంబం పేరిట 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించాం. అలాగే ఈ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ సోదరుడు శివ నవీన్‌ను కూడా కస్టడీకి తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, మరోసారి శివబాలకృష్ణ కస్టడీ కోరాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications