అల్లుఅర్జున్ కు ఊహించని షాక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
చంచల్ గూడా జైలు నుండి బెయిల్ పై వచ్చిన అల్లు అర్జున్
ఇక ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ చంచల్ గూడా జైలుకు తరలించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చారు.

అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు
ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కు మరోమారు ఊహించని షాక్ తగిలింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై యుగేందర్ గౌడ్ అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఆయన ఢిల్లీ లోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో మరోమారు ఈ వ్యవహారంలో చర్చ కొనసాగుతుంది.
అల్లు అర్జున్ వల్లే నిండు ప్రాణం బలైంది
ఒక సినిమా వల్ల ఒకరి ప్రాణం పోయిందని, ఇంకో పసి ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, పోలీసులు రావద్దు అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైంది అని యుగంధర్ పేర్కొన్నారు అల్లు అర్జున్ రావడం వల్లనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ను వదిలిపెట్టేది లేదు
అటువంటి అల్లు అర్జున్ ను వదిలిపెట్టేది లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన యుగేందర్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ్ చికిత్స పొందుతున్నాడు. నిన్న అల్లు అరవింద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను కలిసి వచ్చారు. ఈ క్రమంలో పిల్లవాడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications