ఓటరు జాబితా నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు.. కారణం తెలిస్తే షాక్..
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పేరును ఓటరు జాబితా నుండి తొలగిస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయంపై చెన్నమనేని రమేశ్ నుంచి ఏ విధమైన స్పందన రాలేదు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు ఊహించని షాక్ తగిలింది. వేములవాడ నియోజకవర్గ ఓటరు జాబితా నుంచి ఆయన పేరును అధికారులు తొలగించారు. ఈ మేరకు ఆయన నివాసం ఎదుట నోటీసులు అంటించారు. చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటమే దీనికి కారణంగా చెప్పవచ్చు.
చెన్నమనేని రమేశ్ నుంచి ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ వ్యక్తిని ఏకంగా ఓటరు జాబితా నుంచి తొలగించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. అయితే ప్రభుత్వ విప్, ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేశారు.

చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలకమైన తీర్పును వెలువరించింది. చెన్నమనేని రమేశ్ కు భారత పౌరసత్వం లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications