రీల్స్ చేసే వారికి షాక్ .. వెతికి మరీ పోలీసుల కేసులు!
ప్రస్తుతం సమాజంలో మీడియా కంటే సోషల్ మీడియా రోల్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీడియాలో వచ్చే వార్తలు ద్వారా తెలుసుకునేవారు ప్రజలు. అయితే ఇప్పుడు టీవీ ఛానల్స్, మీడియా సంస్థలు ఇచ్చే వార్తల కంటే సోషల్ మీడియాలో ముందుగానే ఏ సమాచారమైనా హల్చల్ చేస్తుంది.
రీల్స్ కోసం వింత వింత ప్రయోగాలు
ఇక సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న చాలామంది రీల్స్ తోనూ రచ్చ చేస్తున్నారు. డాన్సులు, డైలాగులు, పాటలు ఎలా ఎవరికి తోచింది వారు చేసి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫుల్లుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాము చేసిన రీల్స్ కు లైక్స్, ఫాలోవర్స్ కోసం నానా చావు చస్తున్నారు .ఎవరు చేయంది చేయాలన్న తాపత్రయంతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు.

నోట్లు వెదజల్లుతూ రీల్స్... యువకుడిపై కేసు నమోదు
ఇక అటువంటి కొందరికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. అట్లాంటి వాళ్లను సోషల్ మీడియాలో వెతికి మరీ వారిపై కేసులు పెడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో రోడ్డుపైన హర్ష అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరెన్సీ నోట్లను వెదజల్లుతూ రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లిన సదరు యువకుడిపై మూడు పోలీస్ స్టేషన్ లలో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇకపై అలా రీల్స్ చేస్తే అంతే సంగతి
ఆ యువకుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. నడిరోడ్డుపై ఆ యువకుడు చేసిన పనితో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు..నడిరోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా రీల్స్ చేసే వారి పైన పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు.
వెతికి మరీ కేసులు పెడుతున్న పోలీసులు
ఇక నోట్లు చల్లిన వ్యక్తి పైనే కాదు, బైక్ ల పైన స్టంట్ లు చేసే వారి పైన ప్రజలకు అభ్యంతరకరమైన వీడియోలు చేసే వారి పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయాలని రంగంలోకి దిగారు. అభ్యంతరకరంగా ఉండే వీడియోలు ఏమి చేసినా బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఇకనుంచి రీల్స్ చేసేవారు ఏది పడితే అది చేయడానికి వీల్లేదు అన్నది తాజా పోలీస్ చర్యలతో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications