Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్.. రేవంత్ రెడ్డి పాట పెట్టి రచ్చ!!

నల్గొండ జిల్లా: మునుగోడు ఎమ్మెల్యే గా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామస్తులు షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓ గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖంగు తిన్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్

కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరి మునుగోడు ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవడం కోసం ప్రజల వద్దకు క్షేత్ర స్థాయిలోకి వెళ్తున్న రాజగోపాల్ రెడ్డిని నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపాడు గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ మారి మా గ్రామానికి ఎందుకొచ్చావ్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వివాదం చోటు చేసుకుంది. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడం కోసం, అక్కడి సమీపంలో ఉన్న వినాయక మండపంలో పెద్ద సౌండ్ తో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి పాట పెట్టారు.

పార్టీ ఎందుకు మారావ్ అంటూ నిలదీత

పార్టీ ఎందుకు మారావ్ అంటూ నిలదీత

సౌండ్ తగ్గించాలని బిజెపి కార్యకర్తలు విజ్ఞప్తి చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెట్టించిన సౌండ్ తో పాట పెట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఎందుకు మారారో చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. పార్టీ మారిన వ్యక్తిగా తమ గ్రామానికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. తమ గ్రామానికి రావడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తుంగపాడు గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలు.

మాట్లాడకుండా వెళ్ళిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మాట్లాడకుండా వెళ్ళిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


ఇక సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+