ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు: ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి కరోనాలక్షణాలు ఉన్నాయంటే..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లుగా ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇక కొన్ని కుటుంబాలకు కుటుంబాలే అనారోగ్యంతో మంచం ఎక్కిన పరిస్థితిని ఆరోగ్య సిబ్బంది గుర్తించారు.
Recommended Video

ఇప్పటివరకు జ్వర సర్వేలో నాలుగు లక్షలకు పైగా కరోనా లక్షణ బాధితులు
తెలంగాణ ప్రభుత్వం సర్వే చేపట్టిన తొమ్మిది రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు లక్షలకు పైగా ప్రజలకు కరోనా లక్షణాలున్నట్టుగా ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 90 లక్షలకు పైగా ఇళ్లలో జ్వర సర్వే చేపట్టారు. ఇదే సమయంలో ఆసుపత్రుల ఓపీలలో మరో 6.58 లక్షల మందిని కూడా పరిశీలించారు. ఈ పరిశీలనలో మొత్తంగా ఇప్పటివరకు 4,00, 283 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. అయితే వారందరికీ వైరస్ ఉన్నట్లుగా నిర్ధారణ కాకపోయినప్పటికీ వారికి మెడికల్ కిట్ లను అందించారు.

9 రోజుల్లో నాలుగు లక్షలకు పైగా జ్వర బాధితుల గుర్తింపు
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,97,898 మెడికల్ కిట్లు అందించినట్లు గా సమాచారం. ఫీవర్ సర్వే ప్రారంభించిన 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ఇక కొన్ని జిల్లాలలో మొదటి విడత సర్వే పూర్తి కాగా, రెండో విడత సర్వేను మొదలుపెట్టారు. కామారెడ్డి, జగిత్యాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలలో రెండో విడత సర్వేను ప్రారంభించినట్టు సమాచారం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

ఓపీ సేవల్లో అత్యధికంగా వైద్యులను సంప్రదించినది హైదరాబాద్ లోనే
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 1170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా, 6,58,879 మందికి జలుబు జ్వరం ఒళ్లునొప్పులు తదితర సమస్యలు ఉన్నట్టు తేలింది. ఇక వీరిలో 94,910 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గా గుర్తించారు. ఇక వీరికి కరోనా కిట్లను అందజేశారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలలో అత్యధికంగా ప్రజలు కరుణ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఓపీ సేవలో అత్యధికంగా హైదరాబాద్ లో 1,70,962 మంది అనారోగ్యంతో వైద్యులను సంప్రదించారు. అత్యధికంగా హైదరాబాద్ లో 18,758 మెడికల్ కిట్ లను అందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కిట్ల పంపిణీ ఇలా
ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం లో 9,170 మెడికల్ కిట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి లో 8,278 మెడికల్ కిట్లు, ఖమ్మం జిల్లాలో 5,346 మెడికల్ కిట్లు, నల్గొండ జిల్లాలో 4,374 మెడికల్ కిట్లు, రంగారెడ్డి జిల్లాలో 3,856 మెడికల్ కిట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,138 మెడికల్ కిట్లు అందించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 3,123, మంచిర్యాల జిల్లాలో 3,093, పెద్దపల్లి జిల్లాలో 2,897, నిజామాబాద్ జిల్లాలో 2,833, నాగర్ కర్నూలు జిల్లాలో 2,804 మెడికల్ కిట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,503 మెడికల్ కిట్లు, సిద్దిపేట జిల్లాలో 2,135 మెడికల్ కిట్లు అందించారు.

తెలంగాణా ఆరోగ్య సంక్షోభం ... ఫీవర్ సర్వేలో విస్తుబోయే విషయాలు
ఇక అత్యంత తక్కువగా మహబూబాబాద్ జిల్లాలో 185 మంది మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా అనేక జిల్లాలలో మొదటి విడత ఫీవర్ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఆయా జిల్లాలలో రెండో విడత ఫీవర్ సర్వేను నిర్వహించనున్నారు. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్రం ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్నట్టు ఫీవర్ సర్వే ఫలితాల ద్వారా తెలుస్తుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications