'రేవ్ పార్టీ'ని మించి-కడ్తాల్ ఫాంహౌస్‌లో రెచ్చిపోయిన జంటలు-వెలుగులోకి సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అది పేరుకే బర్త్ డే పార్టీ అని... లోపలంతా అశ్లీల నృత్యాలతో హోరెత్తించారని తెలుస్తోంది. ఈ పార్టీలో 30 మంది జంటలు సహా 70 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పాల్గొన్నట్లు సమాచారం. నిర్వాహకులతో పాటు 67 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా మిగతావారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

21 మంది యువతులు,43 యువకులు అరెస్ట్
కడ్తాల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బాక్స్ కంటైనర్ ఫాంహౌస్‌లో ఈ రేవ్ పార్టీ జరిగింది. వరుణ్ గౌడ్ అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేయగా జీశాన్ అలీ ఖాన్,అన్వేష్ వ్యవహరించారు. మొత్తం 70 మంది వరకు యువతీ యువకులు ఇందులో పాల్గొన్నారు. మద్యం మత్తులో డీజే పాటలతో హెరెత్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫాంహౌస్‌పై దాడి చేశారు. రేవ్ పార్టీని భగ్నం చేసి 21 మంది యువతులు, 43 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

పరారైన వరుణ్ గౌడ్...
పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్... పోలీసుల రాకను గమనించి పరారయ్యాడు. ఈ సందర్భంగా 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్ యజమాని భరత్ ఏ-1గా, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్ అలీఖాన్ ఏ-2గా, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్ ఏ-3గా కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అరెస్టయినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాక... సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Recommended Video

బడా బాబుల పిల్లలు
ఈ పార్టీలో పాల్గొన్నవారిలో బడా బాబుల పిల్లలు చాలామందే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో పాల్గొన్న యువతీ,యువకులు అన్ని హద్దులు మీరిపోయారని... రేవ్ పార్టీకి మించిన సీన్ లోపల కనిపించిందని చెబుతున్నారు. నిజానికి ఈ ఫాంహౌస్‌లో గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం హైదరాబాద్ శివారులోని సంస్థాన్ నారాయణపురంలోనూ పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ జరుగుతున్న ఫాంహౌస్‌పై మెరుపు దాడి చేసి 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతీ యువకులకు సంబంధించి కార్లు, బైకులను సీజ్ చేశారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications