షాకింగ్: ఆ లారీ అనూహ్య టర్న్.. నేరుగా ఆమె పైకి దూసుకొచ్చింది
బుధవారం తెల్లవారు జామున 4.25గంటల ప్రాంతంలో సుమలత అనే పారిశుద్ద్య కార్మికురాలిని ఓ లారీ నేరుగా ఢీకొట్టింది.రోడ్డుపై ఊడుస్తున్న సమయంలో.. వెనకాలే వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది.
వరంగల్: అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. వాళ్లు రోడ్ల మీదకు వస్తారు. తెల్లారేసరికి రోడ్ల మీద చెత్తా చెదారం లేకుండా ఊడ్చేస్తారు. రోడ్డు మీద ఊడుస్తున్న సమయంలో.. ఏ వాహనమో నేరుగా వచ్చి ఢీకొడితే.. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బతుకుల్లో చీకట్లు ఆవరించినట్లే.
ప్రమాదపు అంచున పారిశుద్ద్య కార్మికులు బతుకీడుస్తున్నారని చెప్పడానికి వరంగల్‌లో జరిగిన తాజా ఘటనే నిదర్శనం. బుధవారం తెల్లవారు జామున 4.25గంటల ప్రాంతంలో సుమలత అనే పారిశుద్ద్య కార్మికురాలిని ఓ లారీ నేరుగా ఢీకొట్టింది.

రోడ్డుపై ఊడుస్తున్న సమయంలో.. వెనకాలే వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. నిజానికి ఆ లారీ పక్క నుంచి వెళ్తున్నట్లే కనిపించినా.. ఒక్కసారిగా మహిళ వైపు టర్న్ తీసుకోవడం సీసీటీవి వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.
లారీ ఢీకొట్టడంతో ఎగిరిపడ్డ మహిళను.. పక్కనే ఉన్న మరో పారిశుద్ద్య కార్మికురాలు ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. లారీ అనూహ్యంగా టర్న్ తీసుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో హైదరాబాద్ లోను పారిశుద్య కార్మికులను వాహనాలు ఢీకొట్టిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications