బీజేపీకి షాకిచ్చి కరీంనగర్ లోక్సభ బరిలో బండి సంజయ్ కు పోటీగా ఈటల రాజేందర్?
బీజేపీ నేత, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా చెప్పుకున్న ఈటల రాజేందర్ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారా? ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బాట పడుతున్నారా? కాంగ్రెస్ నుండి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా? అంటే అవునట.. అన్న చర్చ తెలంగాణా సమాజంలో జోరుగా జరుగుతుంది.
బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారని, అతి త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి, గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటమి పాలు కావడంతో, ప్రస్తుతం ఫోకస్ లోక్సభ ఎన్నికలపై పెట్టారని సమాచారం.

ఆయన రానున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు టికెట్ విషయంలో కాంగ్రెస్ కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికలకు బిజెపిలో తీవ్రమైన పోటీ ఉండడంతో, బిజెపి నుండి కాకుండా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లుగా సమాచారం. లోక్సభ కరీంనగర్ స్థానం నుండి పోటీకి ఈటల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది.
బిజెపి కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా, అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలలో పదికి పైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా చేపట్టారు. దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం ఖాళీగా ఉంది.
ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ ను బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కరీంనగర్ జిల్లా పై ఈటల రాజేందర్ కు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో ఈటల రాజేందర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది త్వరలోనే తేలనుంది.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications