వైఎస్ఆర్ పై గులాబీ బాస్ కేసీఆర్ ప్రశంసల వెనుక ఆంతర్యం అదేనా.. ?
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని కలలు కన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి పార్టీ పేరును కూడా మార్చేసి హడావుడి చేశారు. తీరా చూస్తే మాజీ ముఖ్యమంత్రిగా ఫాంహౌస్‌కే పరిమితమైపోయారు. నేషనల్ పాలిటిక్స్ అంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన ఆయన పార్టీకి లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.. ఇక మధ్యతో గారాల కూతురు కవిత అరెస్టు ఆయన్ని మరింత కుంగతీసింది.
కారు పార్టీ పరిస్థితి ప్రెజెంట్ సీన్ ఫుల్ రివర్స్ లో నడుస్తోంది. ఒక్కొక్కరూ దిగిపోతుండటంతో ప్రస్తుతం కళతప్పి వెల వెల పోతున్న పరిస్థితిలో రెండు టర్మ్ లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి మళ్లీ ఊపిరి పోయడానికి గులాబీ బాస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి సంపాదించుకున్నామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణలో ఉందా..? మూగబోయిందా అనే అనుమానాలు అయితే ఇన్నాళ్లు వచ్చాయి. అందుకే కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపేందుకు వరుస మీటింగులు, బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీస్థాయిలో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించింది.
ఈ సభా వేదికగానే తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కు ఉన్న కోట్లాది మంది అభిమానులను ఆకర్షించేందుకు మళ్లీ పాత పాటనే తిరిగి పాడారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ మేరకు సభలో మాట్లాడుతూ.. ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని తాను ఆనాడే చెప్పానని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను రద్దు చేయలేదన్నారు. పేరు మార్చకుండా పథకాన్ని కొనసాగించినట్లు గుర్తుచేశారు. దీంతో కేసీఆర్ వైఎస్ అభిమానులను టార్గెట్ చేసినట్టు సర్వత్రా చర్చ జరుగుతోంది.
గతంలో అసెంబ్లీ వేదికగా కూడా వైఎస్ గురించి ఇవే మాటలని నొక్కి చెప్పారు గులాబీ బాస్. మళ్లీ ఇప్పుడు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడం చూస్తుంటే కాంగ్రెస్ లో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు.. మళ్లీ బీఆర్ఎస్ కి బూస్ట్ అప్ ఇస్తుందో లేదో అని చూడాలి.
కేసీఆర్ నోట YSR మాట..దద్దరిల్లిన సభ..!!#KCR #YSRajasekharreddy #25YearsOfBRS #BRSat25 #Telangana #OITelugu pic.twitter.com/2ECSlVNcYS
— oneindiatelugu (@oneindiatelugu) April 27, 2025












Click it and Unblock the Notifications