జనగామ చిన్నారిని హతమార్చిన చైన్ స్నాచర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. కన్నతల్లే కసాయి!!
జనగామ జిల్లాలో చైన్ స్నాచింగ్ కి వచ్చిన దొంగ పాపను నీటి సంపులో పడేసి హతమార్చిన ఘటన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు చైన్ స్నాచింగ్ కోసం ఎవరూ రాలేదని, తల్లి బిడ్డను దొంగ హతమార్చి కట్టుకథ అల్లింది అని గుర్తించారు.

చైన్ స్నాచర్ చిన్నారిని సంపులో పడేసిన కేసులో షాకింగ్ ట్విస్ట్
జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళ మెడలో నుండి తాళి చోరీకి యత్నించిన దొంగ, ఈ క్రమంలో తన చేతిలో ఉన్న పది నెలల బిడ్డను నీటి సంపులో పడేసి హతమార్చినట్టు ప్రసన్న పేర్కొంది. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కాస్తా ఆమె పైకి మళ్ళింది. ఇక పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తానే తన బిడ్డను నీటి సంపులో పడేసి హతమార్చినట్టుగా ప్రసన్న పోలీసుల ఎదుట అంగీకరించింది.

నీటి సంపులో చిన్నారిని పడేసింది తల్లే .. దొంగతనం కట్టుకథ
ప్రసన్న ఎందుకు తన బిడ్డను హతమార్చింది? ఓ తల్లిగా ఎందుకు ఇంత కఠినం నిర్ణయం తీసుకుంది? అంటే అందుకు పాప అనారోగ్యమే కారణమని చెప్పినట్లుగా సమాచారం. జనగామ పట్టణ అంబేద్కర్ నగర్ లో నివసించే ప్రసన్న, భాస్కర్ దంపతులకు మూడేళ్ల బాబు, పాప ఉన్నారు. బాబుకు గుండె సంబంధిత సమస్యలు రావడంతో ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. అయితే పాప తేజస్విని లోను ఎదుగుదల లేక జీవితాంతం మాటలు రావని వైద్యులు చెప్పడంతో, కృంగిపోయిన ప్రసన్న పాపను నీటి సంపులో పడేసి హతమార్చింది.

అనారోగ్యంతో బిడ్డ ... ఆర్ధిక ఇబ్బందులు భరించలేక కఠిన నిర్ణయం
చైన్ దొంగిలించడానికి వచ్చిన దొంగ పాపను నీటి సంపులో పడేశారని కట్టు కథ అల్లింది. గొలుసు దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి బిడ్డను హతమార్చాడని చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ప్రసన్న. ఇక పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయాన్ని వెల్లడించి తాను చేసిన తప్పును అంగీకరించింది. దీంతో పోలీసులు నిందితురాలిపై హత్య కేసు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను కాపాడుకోలేక, జీవితాంతం భరించలేక కసాయిగా మారిన తల్లి కనికరం లేకుండా కన్నబిడ్డను హతమార్చింది.

జనగామలో చైన్ స్నాచర్ల బెడద.. అందుకే ఇలా కట్టుకథ.. అడ్డంగా బుక్కైన తల్లి
ఇక జనగామ జిల్లాలో చైన్ స్నాచర్లు విపరీతంగా దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో, ఈ కేసు నుండి తప్పించుకోవడానికి చైన్ స్నాచర్ తన బిడ్డను హతమార్చినట్టుగా ప్రసన్న కట్టుకథ చెప్పింది. ప్రసన్న భర్త భాస్కర్ సెలూన్ లో పని చేస్తాడు. ఇప్పటికే పాప చికిత్స కోసం 5 లక్షల రూపాయలు భాస్కర్ ఖర్చుపెట్టినట్లు గా స్థానికులు చెబుతున్నారు.
ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో ఉండటంతో భాస్కర్ కుటుంబం వారి ఆరోగ్యం కోసం పడరాని పాట్లు పడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో భర్త పడుతున్న బాధలను చూడలేక, మానసిక ఒత్తిడికి గురైన ప్రసన్న ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని, మాతృత్వాన్ని చంపుకుని బిడ్డ ప్రాణాలు తీసి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications