Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కేసీఆర్ కు ప్రేమతో బూట్లు.!ఒక్కరోజు తనతో పాదయాత్ర చేయాలన్న షర్మిళ.!

కేసీఆర్ కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే ఒక్క రోజైనా తాను పింపిస్తున్న బూట్లు వేసుకొని పాదయాత్రకు రావాలని వైయస్ఆర్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ సవాల్ విసిరారు.

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ బూట్లను పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో తను చేస్తున్న పాదయాత్రలో కనీసం ఒక్కరోజైనా పాల్గొని ప్రజల కష్టాలు తెలుసుకోవాలని సవాల్ చేసారు వైయస్ షర్మిళ. సీఎం చంద్రశేఖర్ రావు పాలన అద్భుతమంటున్నారని, ఇదే దేశం మొత్తం అమలు చేస్తామంటున్న చంద్రశేఖర్ రావు కు ఛాలెంజ్ విసురుతున్నానన్నారు షర్మిళ. తనతో పాదయాత్రకు వచ్చి సమస్యలు ఏం లేవని రుజువు చేయాలని, సీఎం సమ్యలు ఏం లేవని చూపిస్తే తాను తన ముక్కు నేలకు రాసి రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్లిపోతానని, సమస్యలు ఉంటే సీఎం రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని, సీఎం కు . మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలన్నారు షర్మిళ.

సమస్యలు లేవంటే ఇంటికి వెళ్తా..

సమస్యలు లేవంటే ఇంటికి వెళ్తా..

అంతే కాకుండా సీఎం చంద్రశేఖర్ రావు తమతో పాదయాత్రకు రావడానికి బూట్లు కూడా పంపిస్తున్నామని, సీఎం ఒక్క రోజైనా వచ్చి నడవాలని, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడాలన్నారు షర్మిళ. పిట్టల దొర లాగా ప్రైవేట్ విమానాల్లో టోపీ పెట్టుకొని తిరగడం కాదని, గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆలోచించాలని సూచించారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రజా దర్బార్ ఎంతో వైభవంగా జరిగేదని, సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసేవారని, ఇప్పుడు ఉద్యమకారులకు కూడా చంద్రశేఖర్ రావు కలవడం లేదన్నారు షర్మిళ.

సీఎం వైఫల్యాలు ఎండగడతా..

సీఎం వైఫల్యాలు ఎండగడతా..


అంతే కాకుండా పాదయాత్ర ఒక యజ్ఞంలాంటిదని, అందరికీ సాధ్యం కాదన్నారు షర్మిళ. ప్రతి నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే.. తాను ఈ యజ్ఞానికి, తెలంగాణ ప్రజలకు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి ద్రోహం చేసిన దాన్ని అవుతానన్నారు షర్మిళ. ఇంతకు ముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుందని, అడుగడుగునా సీఎం చంద్రశేఖర్ రావు వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం జరుగుతుందని మరోసారి వైయస్ షర్మిళ పునరుద్ఘాటించారు. తాము ఎవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించబోమని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతేనే ప్రశ్నిస్తామన్నారు షర్మిళ.

రుణ మాఫీ లేదు..

రుణ మాఫీ లేదు..


ఇదిలా ఉండగా తాను గతంలో ఆరోపణలు చేసిన ఎమ్మేల్యేలు తమతమ నియోకవర్గాల్లో పబ్లిక్ ఫోరం పెట్టాలని, ఆరోపణలు చేసిన వారు, మీడియా, ప్రతిపక్షాలు అందరూ వస్తారని, మీ నిజాయితీ ఏంటో ఆ ఫోరంలో నిలబడి సాక్షాధారాలతో నిరూపించుకోవాలని షర్మిళ సూచించారు. తాను అకారణంగా మాట్లాడడని అనేవారు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలన్నారు. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అనుభవిస్తూ తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేశారని, లక్ష రూపాయల లోపు రుణం ఉన్న 36 లక్షల మందికి రుణ మాఫీ చేస్తానని ఇంత వరకు కేవలం 5 లక్షల మందికి మాత్రమే చేశారని సీఎంపై షర్మిళ మండిపడ్డారు.

దళిత ముఖ్యమంత్రి ఏమయ్యాడు..

దళిత ముఖ్యమంత్రి ఏమయ్యాడు..

అంతే కాకుండా 30 లక్షల మంది ఇండ్లు కావాలని అర్జీ పెట్టుకున్నారని, ఇంటి స్థలం కూడా లేదని 10 లక్షల మంది అర్జీ పెట్టుకున్నారని, ఇలాంటి వారిని ఎవ్వరిని కూడా చంద్రశేఖర్ రావు ఆదుకోలేకపోయారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలు అనే హామీని తుంగలో తొక్కారని, దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకూ దళితులను అడుగడుగునా మోసం చేశారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో 19 లక్షల దళిత కుటుంబాలున్నాయని, ఎంతమందికి దళిత బంధు ఇచ్చారని నిలదీసారు. కనీసం 35 వేల కుటుంబాలకు కూడా ఇవ్వలేదని, ఇది కేవలం ఎన్నికల కోసం వచ్చిన స్కీం అన్నారు షర్మిళ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+