ఎస్ఐ దాష్టీకం: టీవీ రిపోర్టర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి చావబాదారు, ఆస్పత్రిలో చేర్చారు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఓ న్యూస్ ఛానెల్ విలేకరిపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. లాఠీలతో విచక్షణా రహితంగా చితకబాదడంతో సదరు రిపోర్టర్ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహా న్యూస్ టీవీ రిపోర్టర్‌గా నాగరాజు పనిచేస్తున్నాడు.

అతని స్నేహితుడి తండ్రి చనిపోవడంతో పరామర్శించే నిమిత్తం హైదరాబాద్ లోని చుడిబజార్ వెళ్లాడు. అక్కడ పని అయిపోగానే, తిరిగి బయలుదేరాడు. దిల్‌షుక్‌నగర్ వచ్చేందుకని రోడ్డుపై నిలబడ్డ నాగరాజు వేచిచూస్తుండగా.. అదే సమయంలో కొంతమంది మద్యం సేవించి ఘర్షణ పడుతున్నారు.

 A SI attacked a TV journalist

అయితే, పోలీసులు రావడాన్ని గమనించిన ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాగరాజు దగ్గరికి వచ్చిన షాయినాత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్పై రాజు.. 'ఎవరు నువ్వు?' అని ప్రశ్నించారు. దీంతో ఫలానా టీవీలో రిపోర్టర్ గా చేస్తున్నట్టు నాగరాజు చెప్పాడు.

అయినప్పటికీ, నాగరాజును పోలీస్ వాహనంలో స్టేషన్ కు తీసుకువెళ్లారు. లాఠీలతో చావబాదారు. దీంతో నాగరాజు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, నాగరాజుపై అకారణంగా దాడి చేసిన ఎస్సై రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A SI attacked a TV journalist in Hyderabad on Sunday night.
Please Wait while comments are loading...