ఎస్సై ప్రభాకర్ ఇష్యూ: కీలకంగా మారిన కాల్ డేటా...శిరీషతో ఎస్సైకి అనుబంధమేంటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి, బ్యూటీషియన్ శిరీష మృతి కేసులు మిస్టరీగా మారాయి. శిరీష హత్యకు గురికాగా, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదివారం రాత్రి ప్రభాకర్ రెడ్డి హైదరాబాదు వెళ్లాడని, శిరీషపై లైంగిక వేధింపులకు దిగాడని, అనంతరం ఆ విషయం బయటపడితే తన ఉద్యోగం, పరువు పోతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

శిరీష కాల్ డేటాయే కీలకం...

శిరీష కాల్ డేటాయే కీలకం...

శిరీష్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ప్రభాకర్ రెడ్డి, శిరీష మధ్య సంబంధాలు ఉన్నాయని తేలినట్లు చెబుతున్నారు. శిరీష భర్త మాట్లాడుతూ, సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన శిరీష...ఆలస్యమవుతుందని రాత్రి 8 గంటల సమయంలో చెప్పిందని, దీంతో తాము రాత్రి 11 గంటల సమయంలో భోజనం చేసి నిద్రపోయామని, అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో తను హైదరాబాదుకు 71 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు లొకేషన్ షేర్ చేసిందని చెప్పారు. తాను కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించానని, ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వెళ్లిపోయానని చెప్పారు. అనంతరం పోలీసులు ఫోన్ చేసి ఆమె మృతి గురించి చెప్పారని తెలిపారు.

ఉన్నతాధికారుల వేధించారా?

ఉన్నతాధికారుల వేధించారా?

అయితే పోలీసు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే అతడు సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయినట్లు సహచరులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తకు ఎవరితోనూ సంబంధాలు లేవని, కేవలం కేసును తప్పుదోవ పట్టించేందుకు తన భర్తపై ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ఎస్సై ప్రభాకర్ రెడ్డి భార్య స్పష్టం చేశారు.

అసలు పరిచయం ఎలా?

అసలు పరిచయం ఎలా?

ఈ నేపథ్యంలో అసలు ఎస్సై ప్రభాకర్ రెడ్డికి.. శిరీషతో పరిచయం ఎలా జరిగింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికోసం ఆమె మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఆర్జీఏ స్టూడియో అధికారి రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ లను కూడా ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్వినిని కూడా విచారించనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ నేపథ్యం...

ఇదీ నేపథ్యం...

పశ్చిమగోదావరి జిల్లా మట్టపర్తివారిపాలేనికి చెందిన సతీష్‌చంద్రతో శిరీష అలియాస్‌ విజయలక్ష్మికి 2004లో పెళ్లైంది. ఉపాధి కోసం 2007లో వీరు హైదరాబాద్‌కు వచ్చారు. సతీష్‌చంద్ర ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. శిరీష బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుని శిక్షకురాలిగా మారింది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలప్పుడు పెళ్లికూతురు అలంకరణ చేస్తానంటూ నాలుగేళ్ల కిందట షేక్‌పేట ప్రధాన రహదారిలోని ఆర్‌.జె.ఫోటోస్టుడియో యజమాని రాజీవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

రాజీవ్ తో పెరిగిన చనువు...

రాజీవ్ తో పెరిగిన చనువు...

శిరీష హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఆర్జీఏ స్టూడియోలో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది. రాజీవ్‌ పెళ్లి ఫోటోలు, వీడియోలు తీస్తే శిరీష పెళ్లికూతురికి అలంకరణ చేసేది. ఈ స్టూడియో యజమాని రాజీవ్ కు తేజస్విని అనే ప్రేయసి ఉంది. అయితే రాజీవ్ తన సంస్థలో పని చేసే శిరీషతో చనువుగా ఉంటున్నాడని, ఈ నేపథ్యంలో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తేజస్విని అనుమానించింది. దీంతో రాజీవ్, తేజస్విని మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఒకసారి తేజస్విని ఈ విషయమై శిరీషను నిలదీసింది. ఆ తరువాత కూడా రాజీవ్, శిరీష సన్నిహితంగా కనిపించగా 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి శిరీష అనే యువతి తనను వేధిస్తోందని ఫిర్యాదు కూడా చేసింది. వారు బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్ కు వెళ్లమని సూచించడంతో వీరు ముగ్గురు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి పోలీసులు వారి సమస్య విని, ఆపైన కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేశారు.

సమస్య పరిష్కారం కోసం...

సమస్య పరిష్కారం కోసం...

ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని రాజీవ్ తన స్నేహితుడు నల్గొండ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రావణ్ ను కోరగా, శ్రావణ్ దీనికోసం తన స్నేహితుడైన సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించాడు. సీన్ లోకి ఎంటరైన ప్రభాకర్ రెడ్డి సెటిల్ చేస్తాను సోమవారం రమ్మన్నాడు. దీంతో శిరీష, రాజీవ్, తేజస్విని, శ్రావణ్ రాత్రి 8 గంటల ప్రాంతంలో కారులో కుకునూర్‌పల్లికి బయలుదేరారు.

వెళ్లిన పనేమిటి? చేసిందేమిటి?

వెళ్లిన పనేమిటి? చేసిందేమిటి?

కుకునూర్ పల్లి వెళ్లే ముందు శిరీష తన భర్తకు ఫోన్ చేసి రాత్రి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పింది. రాజీవ్, శ్రవణ్ వెళ్తూ వెళ్తూ దారిలో మద్యం సీసాలు కొనుక్కుని నేరుగా కుకునూర్ పల్లి వెళ్లారు. తమ మధ్య ఏర్పడిన సమస్య పరిష్కారంలో భాగంగా ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లిన వీరు అక్కడ మద్యం సేవించినట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యలో శిరీష తానెక్కడ ఉన్నదీ తన భర్తకు తెలియడం కోసం లొకేషన్ ను కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా వారి మధ్యన చోటుచేసుకున్న చర్చలు, లేదా వాదోపవాదాల గురించి క్లారిటీ లేదు.

ఆ రాత్రి ఏం జరిగింది?

ఆ రాత్రి ఏం జరిగింది?

ఆ రాత్రి బయలుదేరి కారులో హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కు వచ్చామని, శిరీష బాత్రూంలో సూసైడ్ చేసుకుంటే తాను ఆమె చీరను కత్తిరించి బెడ్ రూంలో పడుకోబెట్టానని రాజీవ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మరి శిరీషపై
ఎస్సై ప్రభాకర్ ఎప్పుడు అత్యాచారం చేశాడు? లేకుంటే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? బాత్రూంలో శిరీష సూసైడ్ చేసుకుని ఉంటే, రాజీవ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాలిగానీ, ఆమె మృతదేహాన్ని దింపి బెడ్ రూంలో ఎందుకు పడుకోబెట్టాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేగాని శిరీషది ఆత్మహత్యో, హత్యో తేలదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 28-year old beautician Sireesha was found hanging to the ceiling fan at RJ Photography office in Hyderabad where she worked as HR Manager too. Her husband has expressed doubts over the suicide incident and lodged a complaint with the police that it could be a murder. Aurumilli Vijayalakshmi alias Sireesha called her husband Satish Chandra on Monday night and informed him she would come home late. According to the reports, on Tuesday morning, she was found dead hanging to the ceiling fan in her photo studio office. Watch how the house owner and Police reacted over the incident.
Please Wait while comments are loading...