శిరీష-ప్రభాకర్ రెడ్డి, ఫోన్లే కీలకం: హైదరాబాద్-కుకునూరుపల్లి ఎప్పుడేం జరిగిందంటే?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష(విజయలక్ష్మి) అనుమానాస్పదంగా మృతి చెందిన తర్వాతి రోజే కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చోటు చేసుకోవడం.. ఆ రెండు రెండూ వేర్వేరు ఘటనలే అయినప్పటికీ ఆ తర్వాత రెండింటికీ సంబంధముందని దర్యాప్తులో తేలడం.. అసలేం జరిగిందన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం గమనార్హం.

సీపీ మహేందర్ రెడ్డి ఈ రెండు మరణాలపై సవివరింగా దర్యాప్తు గురించి మీడియాకు చెప్పినప్పటికీ ఇంకా ఈ కేసులో పలు అంశాలు మిస్టరీగానే ఉన్నాయి. అనేక సందేహాలు అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి. కాగా, ఈ కేసుకు 30గంటల వ్యవధిలో అసలేం జరిగిందో గమనించినట్లయితే..

ఎన్నో మలుపులు

ఎన్నో మలుపులు

మొదట ఆత్మహత్యగానే అనుకున్న శిరీష మృతి చివరకు ఎన్నో మలుపులు తిరిగింది. నిందితులైన రాజీవ్‌, శ్రవణ్‌లు ముందుగా తమకేం తెలీదని చెప్పడంతో పోలీసులకు కొంత ఇబ్బందులెదురయ్యాయి. మరోవైపు కుకునూర్‌పల్లిలో ఆందోళనలు చెలరేగడంతో కొత్వాల్‌ మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దర్యాప్తు బాధ్యత డీసీపీ ఎ వెంకటేశ్వరరావుకు అప్పగించారు.

ఆ రాత్రి క్వార్టర్‌లో ఏం జరిగింది? రెండు గంటలపాటు ఒకే గదిలో శిరీష, ప్రభాకర్ రెడ్డి?

సాంకేతిక ఆధారాలే కీలకంగా..

సాంకేతిక ఆధారాలే కీలకంగా..

సాంకేతిక ఆధారాల సేకరణను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రాజావెంకటరెడ్డిని పర్యవేక్షించమన్నారు. వీరు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటై గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఆధారాలు సేకరించారు. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలేయకుండా అన్నింటినీ భద్రపరిచారు. మద్యం దుకాణంలోని శ్రవణ్‌ రెడ్‌లేబుల్‌ విస్కీ కొన్న సీసీకెమెరా ఫుటేజీ నుంచి ఈ ముగ్గురు ప్రయాణించిన దూరాన్ని స్థలాలను కూడా సేకరించారు.

అందుకే శిరీషను చంపేశారు, ఈ ప్రశ్నలకు సమాధానమేదీ?: తల్లి నిలదీత

కుకునూర్‌పల్లిలోనే...

కుకునూర్‌పల్లిలోనే...

శిరీష, రాజీవ్‌, శ్రవణ్‌లు ముగ్గురూ సోమవారం రాత్రి కుకునూర్‌పల్లికి వెళ్లారు. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వీరితో మాట్లాడారు. ఈ నలుగురూ కలిసున్న అంశాలను సెల్ ఫోన్ల ఆధారంగా గుర్తించారు పోలీసులు.

భర్తకు ఫోన్ చేసిన శిరీష..

భర్తకు ఫోన్ చేసిన శిరీష..

శిరీష తన మొబైల్ ఫోన్( నెం.8686787877) ద్వారా జూన్‌ 13న తెల్లవారుజామున 1.59గంటలకు కుకునూర్‌పల్లిలో ఉన్నట్టు భర్తకు తెలిపింది. రాజీవ్‌ కుకునూర్‌పల్లిలో ఉన్నట్టు అతడి మొబైల్ ఫోన్ (నెం. 9010676767) సిగ్నల్స్‌ ( జూన్‌ 12 రాత్రి 11.56గంటల ప్రాంతంలో) తెలిపాయి.
ఇక శ్రవణ్‌ కూడా కుకునూర్‌పల్లిలో జూన్‌12 రాత్రి 11.32గంటల నుంచి 13 ఉదయం 00.34గంటల వరకూ ఉన్నట్టు అతడి సెల్ ఫోన్(నెంబ. 9010111575) సిగ్నల్స్ వెల్లడించాయి. కాగా, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తన ఇంట్లో ఉన్నట్టు అతడి సెల్ ఫోన్ (9490617067) సిగ్నల్స్‌ జూన్‌ 12 రాత్రి 8.07గంటల నుంచి జూన్‌ 13 ఉదయం 7.27గంటల వరకూ చూపించాయి. అంటే ఈ మధ్యలోనే వీరంతా కలిసినట్లు తెలుస్తోంది.

స్టూడియోలో ఏం జరిగింది..?

స్టూడియోలో ఏం జరిగింది..?

జూన్‌ 13 తెల్లవారుజామున 3.45గంటల నుంచి ఆర్‌జే స్టూడియోలో శిరీష ఆత్మహత్యకు ముందు నుంచి రాజీవ్‌, శ్రవణ్‌లు వ్యవహరించిన తీరుకు సంబంధించిన అన్ని సాంకేతిక ఆధారాలు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సేకరించారు. జూన్‌ 13 ఉదయం 3.47గంటలకు శిరీష ఆర్‌జే స్టూడియోలోకి బయోమెట్రిక్‌ ద్వారా ప్రవేశించింది. ఉదయం 3.55గంటలకు రాజీవ్‌ ఆర్‌జే స్టూడియోలకు బయోమెట్రిక్‌ ద్వారా ప్రవేశించాడు. ఉదయం 3.58గంటలకు రాజీవ్‌ వెలుపలికి వచ్చి కింద శ్రవణ్‌ను కలుసుకున్నాడు.

అంతలోనే ఆత్మహత్య..

అంతలోనే ఆత్మహత్య..

మంగళవారం ఉదయం 3.59గంటలకు శిరీష రాజీవ్‌కు వీడియోకాల్‌ చేసింది. ఈ సమయంలోనే శ్రవణ్‌ను పంపించేందుకు రాజీవ్‌ క్యాబ్‌కు ఫోన్‌ చేశాడు. ఉదయం 4.03గంటలకు రాజీవ్‌.. శిరీషకు వీడియోకాల్‌ చేశాడు. ఉ.4.07 గంటలకు రాజీవ్‌ ఆర్‌జే స్డుడియోలోకి వెళ్లాడు. శిరీష తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టాడు. ఆమె చున్నీకి ఉరేసుకుంది.

శ్రవణ్‌కు ఫోన్ చేసి..

శ్రవణ్‌కు ఫోన్ చేసి..

మంగళవారం ఉ.4.10గంటలకు రాజీవ్‌ శ్రవణ్‌కు ఫోన్‌చేసి శిరీష ఉరేసుకుందని చెప్పి వెనక్కు రమ్మనాడు. ఉదయం 4.11గంటలకు రాజీవ్‌ డయల్‌ 100కు ఫోన్‌చేసి అంబులెన్స్‌ను పంపమని కోరాడు. ఉదయం 4.20గంటలకు రాజీవ్‌ మరోసారి శ్రవణ్‌కు ఫోన్‌చేసి తొందరగా రమ్మన్నాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఉదయం 7గంటల ప్రాంతంలో శిరీష భర్తకు ఫోన్ చేసి ఆర్జే స్టూడియోకు రావాలని చెప్పారు. దీంతో సతీష్ చంద్ర అక్కడికి వచ్చేసరికి మంచంపై శిరీష విగత జీవిగా పడివుంది.

శిరీష ఆత్మహత్యపై అనుమానాలు

శిరీష ఆత్మహత్యపై అనుమానాలు

కాగా, శిరీష ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సతీష్ చంద్రతోపాటు ఆమె తల్లి ఆరోపించారు. నిందితులైన రాజీవ్, శ్రవణ్‌లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కూతురును చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిందితులు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. శిరీష సుమారు 80కిలోలు ఉంటుందని, అంత బరువు ఫ్యాన్ ఎలా ఆపుతుందని శిరీష తల్లి ప్రశ్నించారు. ఒకవేళ శిరీష ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. తమకు మెసేజ్ అయినా పెట్టేది కదా? అని నిలదీశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Confirming that beautician A Vijayalakshmi alias Sirisha's cause of death was hanging by suicide, police arrested two persons including her employer Rajiv and common friend Sravan for abetting it on Friday.
Please Wait while comments are loading...