మనసు దోచే కలెక్షన్స్ తో 'సిల్క్ షోయగం', యామిని భాస్కర్ తో ప్రారంభం (పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : మగువల మనసు దోచే వస్త్రాలతో నగరంలోని శిల్పకళా వేదికలో సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. టాలీవుడ్ నటి యామిని భాస్కర్ లాంఛనంగా ఈ సిల్క్ షోయగం వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. మహిళలు మెచ్చే అన్ని రకాల వెరైటీలతో ఈ నెల 18వరకు సిల్క్ షోయగం వస్త్ర ప్రదర్శన కొనసాగనుంది.

యామిని భాస్కర్

యామిని భాస్కర్

మాదాపూర్ లోని శిల్పా కళా వేదికగా ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ ముద్దుగుమ్మ యామిని భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఫోటోలో.. ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభిస్తూ రిబ్బన్ కట్ చేస్తోన్న యామిని భాస్కర్..

వెరైటీ చీరలతో

వెరైటీ చీరలతో

ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం పలు రకాల వెరైటీ చీరలతో ఫోటోలకు పోజులిచ్చిన యామిని భాస్కర్. ప్రదర్శన తొలిరోజు సందర్భంగా యామిని భాస్కర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

ఎరుపు రంగు చీరలో

ఎరుపు రంగు చీరలో

ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న యామిని భాస్కర్.. వెనకాలే వస్త్రాలను పరిశీలిస్తున్న ఇతర మహిళలు.. ఆర్టిషన్ అండ్ వివర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన 2016 నిర్వహణ కొనసాగుతోంది.

సంతోషం

సంతోషం

వస్త్ర ప్రదర్శనను ప్రారంభించాక, ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన యామి భాస్కర్ చీరలు మగువల అందానికి మరింత వన్నె తెస్తాయన్నారు. రకరకాల వెరైటీ వస్త్రాలతో ఏర్పాటయిన ప్రదర్శన మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటందన్నారు.

సిల్క్ షోయగం

సిల్క్ షోయగం

సిల్క్ షోయగం నిర్వాహకులు అభినంద్ ప్రదర్శన గురించి వివరిస్తూ.. జూలై 18 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థల నుంచి వచ్చే 70 కి పైగా విబిన్న రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

మైసూరు సిల్క్ శారిస్

మైసూరు సిల్క్ శారిస్

మైసూరు సిల్క్ శారిస్, క్రేపే, జార్జేట్, చిఫ్ఫోన్ సిల్క్, టస్సర్ కాంచీపురం, ధర్మవరం, రాసిల్క్ & టస్సర్, జ్యూట్ సిల్క్ , ఢాకా సిల్క్ వంటి స్వచ్చ మైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, వంటి వేలాది రకాల ఉత్పత్తులు, దేశం లోని అనేకాల నగరాలనుండి వచ్చే వస్త్రాలు ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నట్టు నిర్వాహుకులు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Silk Soyagam expo was helding at Hyderabad Shilpakala vedika. Tollywood actress Yamini Bhaskar was officially launched the expo

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X