సిల్లీ రీజన్.. అన్నను చంపిన తమ్ముడు..!

మంచిర్యాల : అన్నాదమ్ముల మధ్య అనుబంధం ఎంతటిదో.. ఆస్తులు రేపే చిచ్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రేమానురాగాలు విరబూయాల్సిన చోట కక్షలు, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. ఆస్తుల గొడవతో ఒకరికొకరు మొఖాలు చూసుకోకుండా తయారవుతోంది పరిస్థితి. అంతేకాదు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినోళ్లు పెద్దయ్యాక, పెళ్లిళ్లయ్యాక శత్రువులుగా మారుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆ క్రమంలో మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. ఇంటి సరిహద్దు విషయంలో జరిగిన గొడవ ఒకరి మృతికి కారణమైంది. లక్ష్మీపూర్ గ్రామంలోని బెస్తవాడకు చెందిన 45 సంవత్సరాల తోకల మల్లయ్యను తమ్ముడు తోకల గంగయ్య కర్రతో దాడి చేసి హతమార్చాడు. కొన్నిరోజులుగా ఈ ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఇంటి సరిహద్దు విషయంలో గొడవ పడుతున్నారు.

silly reason person murdered in brother hand in mancherial

సోమవారం నాడు ఉదయం పూట మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సరిహద్దు మధ్యలో ఉన్న కొయ్యను తీయాలని గంగయ్య అడిగాడు. దాంతో అది తొలగించే ప్రసక్తే లేదని తేగేసి చెప్పాడు మల్లయ్య. దాంతో ఆవేశానికి గురైన గంగయ్య మల్లయ్య తలపై కొట్టాడు. బలమైన దెబ్బ తగలడంతో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. మృతుడి భార్య కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్లయ్యకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+