• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి పేలుడు ఘటన ..ఏపీ ఎఫెక్ట్ ..కోటి పరిహారం డిమాండ్..ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇక వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని , ఏపీ ప్రభుత్వం తరహాలో నిర్ణయం తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇక ఏపీ ఎల్జీ పాలిమర్స్ పరిహారం కోటి ఇచ్చిన ఎఫెక్ట్ తెలంగాణా మీద పడింది . ఇప్పుడు బాంబు పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి ఇవ్వాలని వారు అంటున్నారు . ఇక ఓపెన్ కాస్ట్ గనులను నిర్వహిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై, ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవటంపై కార్మికలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక మృతదేహాలతో ఆస్పత్రి వద్దే ఆందోళనకు దిగారు మృతుల కుటుంబ సభ్యులు .

సంబరాల వేళ సింగరేణి ఓపెన్ కాస్ట్ లో విషాదం ..భారీ పేలుడుతో నలుగురు మృతిసంబరాల వేళ సింగరేణి ఓపెన్ కాస్ట్ లో విషాదం ..భారీ పేలుడుతో నలుగురు మృతి

గోదావరిఖని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

గోదావరిఖని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతి చెందిన కుటుంబాలకు చెల్లించడానికి మహాలక్ష్మి కంపెనీ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. మరోపక్క ప్రమాదం జరిగి 24 గంటలు అయిన మృతదేహాలకు పోస్ట్ మార్టెం సైతం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సింగరేణి ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఘటనకు బాధ్యులను సస్పెండ్ చెయ్యాలి .. మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఘటనకు బాధ్యులను సస్పెండ్ చెయ్యాలి .. మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఇక అంతే కాదుమంగళవారం జరిగిన ప్రమాదానికి కారణమైన వారిని సస్పెండ్‌ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు గోదావరిఖని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు డి. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్జి పాలిమర్స్‌ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చినట్లు సింగరేణి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగఅవకాశం కల్పించాలని, తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏపీ ఎల్జీమర్స్ ఘటన ఎఫెక్ట్ తెలంగాణాలో .. కోటి రూపాయల పరిహారానికి డిమాండ్

ఏపీ ఎల్జీమర్స్ ఘటన ఎఫెక్ట్ తెలంగాణాలో .. కోటి రూపాయల పరిహారానికి డిమాండ్

ఏపీలో ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ ఘటన ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో స్పష్టంగా కనిప్సితుంది. తాజాగా జరిగిన భారీ బాంబు పేలుడు ఘటన నేపధ్యంలో కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా డిమాండ్ వినిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కానీ ఈ ఘటనపై అటు పభుత్వం కానీ , ఇటు అధికారులు కానీ , ఓపెన్ కాస్ట్ నిర్వహిస్తున్న సంస్థ కానీ ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు .

Recommended Video

Harish Rao Speech At Tupaki Ramudu Pre Release Event || సత్తిని పొగడ్తలతో ముంచెత్తిన హరీష్ రావు
ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ , సీపీఎం నాయకులు

ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ , సీపీఎం నాయకులు

ఇక ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు సంభవించిన పేలుడు ప్రమాదం దురదృష్టకరమని పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మృతి చెందిన వారి కుటుంబాలకు రెగ్యులర్ కార్మికులకు ఇచ్చినట్లుగానే నష్టపరిహారం చెల్లించాలని అటు సింగరేణి యాజమాన్యాన్ని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు గాయపడిన వారికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అటు సిపిఐ, సిపిఎం నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

English summary
Four people were died in a bomb blast in the Singareni Open Cast coal mine. The deceased families are demanding compensation of one crore rupees The effect of the AP LG Polymers Compensation one Crore rupees now showing effect on Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X