సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న వారికి పండుగలాంటి వార్త!

తెలంగాణా ప్రభుత్వం సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఉంటున్న వారికి శుభవార్త చెప్పింది. సింగరేణి స్థలాలలో స్థిరంగా నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గోదావరిఖని, మంచిర్యాల, మందమర్రి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి స్థలాలపై స్థిరంగా నివసిస్తున్నవారికి పట్టాలు ఇవ్వాలని ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

తాజాగా మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట హనుమాన్ ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు.
రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి పట్టాలను క్రమబద్ధీకరించారని ఆయన గుర్తు చేశారు.

singareni lands Minister Sridhar Babu announces that people living permanently on Singareni lands in Godavarikhani Mancherial and other areas will get land titles as directed by Deputy CM Bhatti Vikramarka

అయితే ఇంకా మిగిలి ఉన్నవారికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు అందించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానికులు చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి కష్టాలను గుర్తించి పరిష్కారం వైపు అడుగులు వేస్తోందని ఆయన సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ళ పథకం అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఇళ్ళ పట్టాలు లేకున్నా సింగరేణి భూముల్లో చాలా కాలంగా ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చి శాశ్వత నివాసాన్ని కల్పిస్తామని చెప్పారు. మంథని ప్రాంతంలో జరిగిన గణేశ పూజలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై కూడా దృష్టి సారించారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కుటుంబాలకు భూమి హక్కులు కల్పించడం ద్వారా వారి జీవనోపాధికి భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన అన్నారు.

వరంగల్ విమాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!
వరంగల్ విమాశ్రయానికి మెజార్టీ ప్రజలు సూచించిన పేరు ఇదే!

ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగేలా పనులు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే సింగరేణి ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారి భూ సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+