సింగరేణి కేసీఆర్ కుటుంబ ఆస్తి కాదు.!కవిత చేతిలో సీఎండి కీలుబొమ్మ.!ఈటల సంచలన ఆరోపణలు.!
ఆదిలాబాద్/హైదరాబాద్ : సింగరేణిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన కుటుంబ ఆస్తిగా మారుస్తున్నారని, వారి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కల్వకుంట్ల కవితకు సింగరేణిని అప్పగించారని, కవిత చెప్తేనే సీఎండీ గారు స్పందిస్తారని బీజేపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసారు.సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తారని, రాష్ట్ర గులాబీ నేతలు చేస్తున్న విష ప్రచారం తప్పని, దీనిపైన బహిరంగ చర్చకు సిద్దమన్నారు ఈటల రాజేందర్.

సింగరేణి కార్మిక చైతన్య యాత్ర..
బీఎమ్మెస్ ఆద్వర్యంలో జరుగుతున్న సింగరేణి కార్మిక చైతన్య యాత్రను ఈటల రాజేందర్ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ ఏరియా అర్ కే 6వ గని వద్ద జరిగిన ప్రారంభ సభలో ఈటల రాజేందర్ ప్రసంగించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను రాయితీ ఇవ్వాలని. బీజేపి అధికారంలోకి వస్తే తప్పుకుండా అమలు ఇస్తామనన్నారు ఈటల రాజేందర్. ఇక్కడ దోచుకున్న డబ్బులను యుపి, బీహార్, బెంగాళ్, తమిళనాడు, కర్ణాటక ఎనికలకోసం పంపిస్తున్నారని, మన దగ్గర వేల కోట్లు దోచుకొని పక్క రాష్ట్రాల ఎన్నికల కోసం పంపే నీచ స్థాయికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిగిపోయారని,ఇది లంచగొండి ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వమని ధ్వజమెత్తారు ఈటల రాజేందర్.

గులాబీ నేతల విషప్రచారం..
అంతే కాకుండా సింగరేణిలో 15 సంవత్సరాల అనుబంధం ఉందని, అనేక సందర్బాల్లో అనేక సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు ఈటల. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లతో బొందల గడ్డలా మారుతుందని, ఎడారిగా మారిపోయి వేలాదిమంది పొట్ట చేత పట్టుకుని వలసపోవాల్సిన పరిస్తితి వస్తుందని ఆ రోజుల్లో పాదయాత్ర చేసామని ఈటల గుర్తు చేసారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారు అని రాష్ట్ర గులాబీ నేతలు చేస్తున్న విష ప్రచారం తప్పని, సింగరేణిలో రాష్త్ర వాటా 51%, కేంద్రం వాటా 49%. అయినా ఏనాడూ కూడా కేంద్రం సింగరేణిలో జోక్యం కలిగించుకొలేదన్నారు ఈటల.

ఉత్పత్తి పెరిగింది..
రాష్ట్రం వచ్చిన తరువాత సింగరేణి గొప్ప సంస్థగా ఎదుగుతుందని చంద్రశేఖర్ రావు అనేక సందర్బాల్లో చెప్పారని, ఆస్ట్రేలియాలో గనులు తవ్వే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్న చంద్రశేఖర్ రావు ఈ 8 ఏళ్ళల్లో ఎన్ని ఉద్యోగాలు పెంచారో చెప్పాలని నిలదీసారు. 50-55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుండి 65 మిలియన్ టన్నులకు సామర్థ్యం పెరిగింది కానీ, 63 వేల ఉద్యోగాల నుండి 43 వేల ఉద్యోగాలకుఎందుకు పడిపోయిందో చంద్రశేఖర్ రావు సమాధానం చెప్పాలన్నారు.
సామర్థ్యం పెరిగినందుకు 40 వేల ఉద్యోగాలు పెరగాలని, కానీ ఉద్యోగాలు తగ్గిపోయాయని, దీంతో చంద్రశేఖర్ రావుకు సంస్థ పట్ల ఎంత ప్రేమ ఉందొ అర్థం అవుతోందని ఎద్దేవా చేసారు.

కేంద్రం ముందుచూపు..
కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ తీర్పు అనుసరించి సీఎంఎస్పీ అనే కొత్త చట్టాన్ని రూపొందించి, బొగ్గు గనులను పద్దతి ప్రకారం కేటాయింపులు చేసిందన్నారు ఈటల. ఆ పద్దతిలో మనం కూడా ఒరిస్సాలో రెండు మైన్ తీసుకున్నామని, నయని బ్లాక్ 15 మిలియన్ టన్నులు, న్యూ పాత్రపడ 20 మిలియన్ టన్నుల బొగ్గు గనులు సింగరేణి దక్కించుకుందన్నారు.
వీటి ద్వారా ఇప్పుడు సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బోగ్గులో 3వ వంతు అక్కడ ఉత్పత్తి కానుందని, ఇది మనకు దక్కడానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానం కాదా అని సీఎం చంద్రశేఖర్ రావును ఈటల సూటిగా ప్రశ్నించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications