సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. స్థానిక ప్రైవేట్ (హోలిస్టిక్) ఆస్పత్రిలో సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్లో కల్పన తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.కల్పన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్పన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెండు రోజులుగా కల్పన ఇంటి గేట్లు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ.. అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్‌ సభ్యులు ఆమెతో మాట్లాడేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో, ఆమె భర్తకు కాల్‌ చేసి విషయం చెప్పారు. ఆయన కూడా కల్పనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

Singer Kalpana attempts suicide

అసోసియేషన్ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు తలుపులు పగులకొట్టారు. ఇంట్లో కల్పన అచేతన స్థితిలో ఉండటంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కల్పన భర్త చెన్నై నుంచి బయలుదేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.కల్పన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక పాటలు పాడారు. ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+