ఆమె ఓ ఏటీఎం మెషీన్: శ్రీకాంత్, ఇలాంటి నా కొడుకుల చేతిలో: మధుప్రియ

హైదరాబాద్: నిన్నటి వరకు మంచివాడిగా కనిపించిన తాను ఒక్కసారిగా చెడ్డవాడిని ఎలా అయ్యానని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అంటున్నారు. మధుప్రియ చేసిన ఆరోపణల వెనుక ఆమె తల్లిదండ్రుల కుట్ర ఉందని ఆరోపించాడు. ముఖ్యంగా తల్లి ఉందని చెప్పాడు.

తాను ఎవరితోనైనా బహిరంగంగా చర్చకు సిద్ధమని చెప్పాడు. ఆమెపై తనకు ప్రేమ తగ్గలేదన్నాడు. మధుప్రియ ఓ ఏటీఎం మెషీన్ అని, ఆమె తన దగ్గరకు వచ్చిన తర్వాత.. తల్లిదండ్రుల వద్ద డబ్బు లేక ఆమె మనసు మార్చారని ఆరోపించాడు. ఇంట్లో డబ్బులేక పూట గడవక తన భార్యను తనకు దూరం చేసే కుట్ర పన్నారన్నాడు.

Also Read:పిక్చర్స్: మధుప్రియ ఎందుకు ఎలా చేసింది?

శవమై వచ్చి ఉండేదాన్ని: మధుప్రియ

శ్రీకాంత్ అంటే ఎంతో ఇష్టంతో తాను వివాహం చేసుకున్నానని, ఆ ప్రేమ గత రాత్రితో పోయిందని గాయని మధుప్రియ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్‌తో భర్త శ్రీకాంత్ మాట్లాడుతుండగా.. మధుప్రియ ఫోన్‌లైన్‌లోకి వచ్చారు.

Singer Madhu Priya files complaint against husband, Srikanth comndems allegations

ఆమె మాట్లాడుతూ... తనను బాగా కొట్టాడని ఆరోపించారు. అమ్మానాన్నల మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న తాను తిరిగి వారి మాటలను విని భర్తపై ఆరోపణలు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. అతను దుర్మార్గుడని తెలుసుకున్న తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఇప్పటికీ బయటకు రాకుండా ఉంటే తన శవం కనిపించి ఉండేదన్నారు. కడుపులో తన్నాడని, ఆ తర్వాతే ఇక శ్రీకాంత్ దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనను చేసుకున్నాకే దరిద్రం పట్టుకుందని తిడుతూ వేధించేవాడని, చంపేందుకు కూడా చూశాడన్నారు.

Also Read: ప్రేమ అంటేనే ఇబ్బంది, ప్రేమికుడ్ని వదలుకోలేం: 'హైడ్రామా'పై మధుప్రియ, 2న రిసెప్షన్

మరో సందర్భంలో మధుప్రియ మాట్లాడుతూ... ఎవరు కూడా తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోవద్దని, తనకు ఈ ఆరు నెలల్లో 60 ఏళ్ల అనుభవం ఎదురైందని చెప్పారు. తల్లిదండ్రులు ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలని యువతకు హితవు పలికారు. తాను తన తప్పు తెలుసుకున్నానని అభిప్రాయపడ్డారు.

ప్రేమించిన తర్వాత కూడా అమ్మానాన్నలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని యువతులకు పిలుపునిచ్చారు. లేదంటే ఇలాంటి నా కొడుకుల (భర్త శ్రీకాంత్‌ను ఉద్దేశించి) చేతిలో అమ్మాయిలు బలవుతారని అభిప్రాయపడ్డారు. తన జీవితం బలైందని భావించడం లేదని, తాను గుణపాఠం నేర్చుకున్నానని చెప్పారు. మధుప్రియ ఆరోపణలను భర్త శ్రీకాంత్ కొట్టి పారేస్తున్నాడు.

Singer Madhu Priya files complaint against husband, Srikanth comndems allegations

మధుప్రియ షాకింగ్

తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని శనివారం హుమాయూన్ నగర పోలీసులను ఆశ్రయించిన గాయని మధుప్రియ.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఆయనపై విరుచుకు పడింది.

అయితే, మాటలో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కొంత మెత్తపడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తన అత్తా, ఐదుగురు ఆడపడుచులు మంచివాళ్లేనని మధుప్రియ చెప్పారు. తన భర్త శ్రీకాంత్ తిరిగి వచ్చి క్షమాపణలు కోరితే తిరిగి వెళ్లేందుకు సిద్ధమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

నువ్వు ఆడపిల్లవమ్మా... కాస్తంత ఓపిక పట్టాలి అని అత్త చెప్పిందని, నేనూ ఓపిక పట్టానని, మీకు తెలుసుగా ఆడపిల్లకు భూదేవంత ఓపికుంటుందని, కానీ ఆడపిల్ల ఓపిక నశిస్తే, ఓ శక్తిగా మారుతుందని, ఇప్పుడు నా పరిస్థితీ అంతేనని, ఆరు నెలల వ్యవధిలో 60 ఏళ్ల అనుభవం వచ్చిందని మధుప్రియ చెప్పారు. శ్రీకాంత్ అంటే ఎంతో ప్రేముందని, తన వైఖరిని మార్చుకున్నాడన్న నమ్మకం కలిగితే కాపురానికి వెళ్తానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+