చెల్లి చనిపోయిందని, అక్క కూడ ఆత్మహత్య చేసుకొంది
చిన్న గొడవ ఒకరి మరణానికి దారితీయగా, మరోకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ కూడ అక్క చెల్లెలు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో చోటుచేసుకొంది.
మహేశ్వరం :చిన్న గొడవ ఒకరి మరణానికి దారితీయగా, మరోకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ కూడ అక్క చెల్లెలు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో చోటుచేసుకొంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాల గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్ళు ఇద్దరు మంగళవారం నాడు గొడవపడ్డారు. అయితే ఈ ఘటనలో మనస్థాపానికి గురైన చెల్లి ఫినాయిల్ తాగింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.

చెల్లి చనిపోయిందనే విషయం తెలుసుకొన్న అక్క మధనపడింది. గొడవ కారణంగానే తన చెల్లి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన చెందింది. దీంతో చెల్లి మరణించిందని ఆమె భావించింది. చెల్లి మరణాన్ని తెలుసుకొని అక్క కూడ ఫినాయిల్ తాగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
చెల్లి మృతదేహాన్ని ఇంటికి తెచ్చేలోపుగానే అక్క కూడ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కా చెల్లెళ్ళు చిన్న విషయానికే ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.












Click it and Unblock the Notifications