నయీం ఎన్‌కౌంటర్: నేటీకీ ఏడాది పూర్తి, 227 కేసులు, ఆ పేర్లను తప్పించారా?
గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెంది సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. గత ఏడాది ఇదే రోజున మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం మరణించాడు. సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, హత్యలు
హైదరాబాద్:గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెంది సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. గత ఏడాది ఇదే రోజున మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం మరణించాడు.
సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, హత్యలు, బెదిరింపులకు పాల్పడినట్టుగా పలు కేసులు నయీంపై ఉన్నాయి. నయీం కేసులో ప్రధానంగా విన్పించిన రాజకీయనేతలపై ఎటువంటి చర్యలు లేవు. పోలీసుశాఖలో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సిట్ వ్యవహరించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికారపార్టీకి చెందిన నేతల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందనే కారణంగానే కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయీం గురించి తెలియనివారు లేరు. అయితే నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నయీం గురించి తెలియనివారికి, తెలిసినవారికి కూడ ఇంకా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాజకీయనాయకులు, పోలీసు ఉన్నతాధికారులు నయీంతో అంటకాగారని సమాచారం. అయితే ఈ కేసులో పెద్ద తలకాయలను తప్పించి చిన్నవారిని బలిచేశారని విపక్షాలు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించాయి.
ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులు బయటపడిన నేతలపై చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. నయీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులే ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడ మీడియాలో ప్రసారమయాయ్యాయి. అంతేకాదు సిట్ అధికారులు ఈ విషయమై కొందరిని ప్రశ్నించారు.

227 కేసులు నమోదు
గ్యాంగ్‌స్టర్ నయీం హత్యకేసులో ఇప్పటికే ఏడాది పూర్తైంది. రాష్ట్ర వ్యాప్తంగా నయీం వ్యవహరానికి సంబంధించి 227 కేసులు నమోదైనట్టుగా సిట్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసులకు సంబంధించి 895 సాక్షులను విచారించినట్టు చెప్పారు.
Recommended Video


128 అరెస్ట్ చేసిన పోలీసులు
నయీం కేసులో ఇప్పటికే 128 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పెద్ద తలకాయలను వదిలేశారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అరెస్టు చేసినవారు కాకుండా మరో 109 మందిని కూడ తమ కస్టడీలోకి తీసుకొని విచారించినట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు.

9 కేసుల్లోనే చార్జీషీట్ దాఖలు
ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు.ఇంకా 22 కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు సిట్ అధికారులు ప్రకటించారు. నయీం కేసులకు సంబంధించి విచారణ తుదిదశకు చేరుకొందని పోలీసులు వెల్లడించారు. నయీం గ్యాంగ్‌లోని 14 మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు.

నలుగురు పోలీసులపై చర్యలు
నయీంతో అంటకాగినట్టు రుజువు కావడంతో నలుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకొన్నట్టు సిట్ ప్రకటించింది. మరో 4 పోలీసు అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్టు సిట్ పేర్కొంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications