సిట్ విచారణలో కేసీఆర్ కు షాకింగ్ ప్రశ్నలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాట్ నెక్స్ట్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కొనసాగిన సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని నంది నగర్ లోని ఆయన నివాసంలో ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఫోన్ టాపింగ్ వ్యవహారం పైన అధికారులు కేసీఆర్ కు అనేక ప్రశ్నలను సంధించారు.
కేసీఆర్ ను విచారించిన సిట్ బృందం
ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించిన ఆధారాలను బట్టి, ఈ కేసులో అరెస్టయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఆయనే అన్న కోణంలో సిట్ బృందం ఆయనను విచారణ చేసినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ సమాధానాలను డీటెయిల్ గా నమోదు చేసుకున్న అధికారులు
మాదాపూర్ డిసిపి రీతి రాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్, నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కె ఎస్ రాములు ఈ విచారణలో కెసిఆర్ కు ప్రశ్నలు సంధించారు. వారు అడిగిన ప్రశ్నలకు కెసిఆర్ ఇచ్చిన సమాధానాలను అధికారులు క్షుణ్ణంగా డీటెయిల్ గా నమోదు చేసుకున్నారు.
మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సుదీర్ఘ విచారణ
ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సుదీర్ఘంగా విచారించారు. ఇక ప్రస్తుతం కెసిఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఇతరులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్పారు. కెసిఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా తర్వాత విచారణ ఏ విధంగా మారుతుంది. ఈ కేసులో ఇంకా ఎవరికి నోటీసులు అందే అవకాశం ఉంది అనేది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ విచారణతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు
ఇలా ఉంటే కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కెసిఆర్ విచారణ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. మొత్తంగా నేడు అనేక ఉద్రిక్తతల మధ్య తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగింది.












Click it and Unblock the Notifications