తెలంగాణ, ఏపీ హైకోర్టులకు ఆరుగురు జడ్జీల సిఫార్సు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టులకు జడ్జీలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
తెలంగాణ హైకోర్టుకు వై రేణుక, నందికొండ నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్ పేర్లను, ఏపీ హైకోర్టుకు హరిహరనాథ శర్మ, యడపల్లి లక్ష్మణరావు పేర్లను సిఫార్సు చేసింది. జ్యూడీషియల్ ఆఫీసర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్‌పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్ బోర్డుకు సేవలు అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2024, మార్చి 21న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా, హైకోర్టు సీజేగా ఆయన నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications