అనుమానాస్పదంగా తిరుగుతున్న నైజీరియన్ల అరెస్ట్
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ సన్‌సిటీ వద్ద పోలీసులు ఆరుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. సన్‌సిటీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నైజీరియన్ల సమాచారంను స్థానికులు పోలీసులకు అందించారు.
సన్‌సిటీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నైజీరియన్లను ప్రశ్నించారు. పాస్‌పోర్టు లేకుండానే నగరంలో ఉన్నట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నైజీరియన్లను నగరానికి వచ్చిన తీరుపై ఆరా తీస్తున్నారు.

ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠా అరెస్టు
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో ఏడుగురు సభ్యుల దోపిడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దొంగల ముఠా నుంచి రెండు తుపాకులు, కత్తులు స్వాధీనంచేసుకున్నారు.
ఇద్దరు దొంగలు అరెస్ట్
హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications