Road Accident: మహబూబ్‍నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
మహబూబ్‍నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు విడిచారు. బాలానగర్ మండలం వార సంతలో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటోను డీసీఎం అతివేగంగా బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ పక్కన ద్విచక్ర వాహనం పై వెళ్తున్న మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

మృతి చెందిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. డీసీఎం హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తుండగా.. చౌరస్తాలో ఆటోను బలంగా ఢీకొట్టింది. మృతదేహాల శరీర భాగాలు తెగిపడ్డాయి. దీంతో అక్కడ భీతవాహ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో జరిగిన మరో ప్రమాదంలో తండ్రికొడుకులు మృతి చెందారు. నాగోల్ గౌరెల్లి పాపాయి గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
కుత్బుల్లాపూర్‌కు చెందిన కుతాడి కుమార్, అతని కుమారుడు ప్రదీప్ కలిసి ఎలక్ట్రిక్ బైక్‌పై కుంట్లుర్ వెళుతున్నారు. ఈ క్రమంలో పాపాయి గూడ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత టిప్పర్ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. టిప్పర్, ఎలక్ట్రిక స్కూటర్ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కుమార్, అతని కుమార్డు ప్రదీప్ ఘటనాస్థలిలో ప్రాణాలు వదిలారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications