మళ్లీ చెలరేగిన చైన్‌స్నాచర్లు: అంతరాష్ట్ర గొలుసు దొంగల ముఠా అరెస్ట్, కేజీ గోల్డ్ సీజ్
హైదరాబాద్: అంతరాష్ట్ర గొలుసు దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుల నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 30కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.
మళ్లీ చెలరేగిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్ నగరంలో మరోసారి చైనా స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. మీర్‌పేటలోని సాయి విహార్ కాలనీ, ప్రశాంత్ నగర్‌లో గొలుసు దొంగతనాలు జరిగాయి.

సాయివిహార్ కాలనీలో మహిళ మెడ నుంచి 3 తులాల గొలుసు, ప్రశాంత్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేరేడ్‌మెట్ సింహాద్రినగర్‌లోనూ గొలుసు దొంగతనం ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు మహిళ మెడ నుంచి 4 తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయారు. జరిగిన ఘటనపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వరంగల్‌లో మరో గొలుసు దొంగతనం
వరంగల్‌లోని ఎక్సైజ్ కాలనీలో ఓ మహిళ మెడ నుంచి దుండగులు 3 తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయారు. అంతరాష్ట్ర దొంగలతో పాటు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన దుండగులు దొంగతనాలతో స్వైరవిహారంతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications