ఔట్‌లుక్‌కు స్మిత అగర్వాల్ నోటీస్: ఫోన్ ట్యాపింగ్‌ ఎఫెక్ట్‌తో రాజీవ్ త్రివేది

హైదరాబాద్: తనపై అసభ్య కథనాలు రాసిందని ఆరోపిస్తూ ఔట్‌లుక్ మ్యాగ్జిన్‌పై తెలంగాణ సీఎంవోలోని అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ న్యాయపరమైన చర్యలకు సిద్ధపడ్డారు. ఈమేరకు తన న్యాయవాది ద్వారా ఔట్‌లుక్ పత్రికకు లీగల్ నోటీసు పంపించారు.

తన క్లయింట్‌ స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా కథనాలు రాశారని అంటూ దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది ఐదు పేజీల నోటీసు పంపించారు. దీనిపై ఔట్‌లుక్ నుంచి సమాధానం రాగానే పరువు నష్టం దావా వేసే యోచనలో స్మితా సబర్వాల్ ఉన్నారు.

Smitha Agarwal serves notice to Outlook

తెలంగాణ నూతన హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఐపీఎస్ అధికారి రాజీవ్‌ త్రివేది నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పటి వరకు హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం తప్పించిందనే ప్రచారం సాగుతోంది.

అయితే, ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగుతున్న కీలక సమయంలో బుర్రా వెంకటేశ్ అకస్మాత్తుగా నెల రోజులు సెలవులు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే వెంకటేశ్ సెలవులపై వెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వెంకటేశ్ సెలవులపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదిని హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+