తెలంగాణ పోలీసు స్టేషన్లన్నింటికి సోషల్ మీడియా ఖాతాలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిరోజూ ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేందుకు తెలంగాణలోని అన్ని పోలీస్‌స్టేషన్లకి ప్రత్యేకంగా ఒక ఫేస్‌బుక్, ఒక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించబోతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో రక్షణ, భ‌ద్ర‌త‌ల‌ను ప్ర‌జ‌లంద‌రికీ చేరువ చేసే యోచ‌న‌లో భాగంగా సాంకేతిక ప‌రిజ్ఞాన స‌హ‌కారం తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 800 పోలీసు స్టేష‌న్ల‌కు ప్ర‌త్యేక సోష‌ల్‌మీడియా ఖాతాల‌ను సృష్టించ‌నున్నామన్నారు.

Social Media Accounts for all Telangana Police Stations!

మొద‌ట హైద్రాబాద్‌లోని స్టేష‌న్ల‌కి, త‌ర్వాత ఇత‌ర జిల్లాల్లోని స్టేష‌న్ల‌కి ఈ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నామని, ఈ ఖాతాల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డ‌మే కాకుండా వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామ‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana DGP Mahendar Reddy told that they are going to start social media accounts for all the police stations. For every police station in the state should have account in Facebook and Twitter soon. All the 800 police stations will be giving special social media accounts. With the help of these online accounts police will be in touch with all the people of the state and they also take feedback from the people, he concluded.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి