సర్పంచ్ రేసులో సాఫ్ట్‌వేర్ కంపెనీ అధిపతి.. పంచాయతీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్!
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మూడు విడతల్లో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో డిసెంబర్ 11వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 14, డిసెంబర్ 17 తేదీలలో రెండు, మూడు దశల పోలింగ్ జరిగి అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల పోరు చాలా ఆసక్తికరంగా మారింది.
సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నత విద్యావంతులు
ఎన్నికలలో ఉన్నత విద్యావంతులు, విదేశాలలో స్థిరపడిన వారు, సాఫ్ట్వేర్ కంపెనీల అధినేతలు కూడా పోటీ చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా హుస్నాబాద్ మండలం జిల్లెల్ల గడ్డ పంచాయతీలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని లావుడ్య రవీందర్ సర్పంచ్ పదవిలో ఎన్నికల బరిలోకి దిగారు. ఉన్నత విద్యావంతుడైన, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉన్న రవీందర్ సర్పంచ్ పదవి కోసం ఎందుకు పోటీ చేస్తున్నారు అన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

జిల్లెల గడ్డ గ్రామంలో సర్పంచ్ పదవికి సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతి
జిల్లెల గడ్డ గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్ కు కేటాయించడంతో రవీందర్ పోటీ చేశాడు. బీటెక్ ,ఎంబీఏ పూర్తి చేసిన రవీందర్ విదేశాలలో పనిచేసే వచ్చి, హైదరాబాద్లో సొంత సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టుకుని ప్రస్తుతం దాని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే జిల్లెల గడ్డ అభివృద్ధి కోసం ఆయన సర్పంచిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి
ఈ క్రమంలో ఆయన తన అనుచరుల సమక్షంలో డప్పుల మోతలు మధ్య ఎన్నికలలో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ సమర్ధుడైన వాడు ఉండాలని, అందుకే తాను పోటీ చేస్తున్నట్టుగా రవీందర్ చెబుతున్నాడు. తమ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ఆ నమ్మకంతోనే ఓటర్లు తనకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అన్న ఆశావాహ దృక్పథం తనకు ఉందన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో కొత్త ట్రెండ్
ఏది ఏమైనా సర్పంచ్ ఎన్నికలు కూడా ఈసారి సరికొత్త ట్రెండును క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నికల బరిలోకి దిగి రాజకీయాలలో సర్పంచ్ గా తమ ప్రస్తానాన్ని కొనసాగించడానికి వెనకాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అటువంటి పరిస్థితే ఉంది.












Click it and Unblock the Notifications