ప్రమాణ స్వీకారానికి ముందే రేవంత్ తొలి విజయం..!!
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరుతుంది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ముందే గతంలో చెప్పిన హామీలు అమలు చేస్తున్నారు. నాడు సీఎం కేసీఆర్ గా ఉన్న సమయంలో అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఎవరికీ అనుమతి ఉండేది కాదు. అనేక ఆంక్షలు అమలు చేసారు. ప్రగతి భవన్ ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార సమయానికే పూర్తి గా ప్రజలకు నేరుగా సీఎంను కలిసే వీలుగా నిర్ణయం అమలవుతోంది.
ప్రగతి భవన్ వద్ద కంచెను తొలగిస్తున్న సిబ్బంది..!! pic.twitter.com/L9ZdTXhSJg
— oneindiatelugu (@oneindiatelugu) December 7, 2023
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ పేరును మార్చేస్తామని రేవంత్ నాడు హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ ను ఇక ప్రజా భవన్ గా మారుస్తామని చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్ పేరును డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ భవన్ గా మార్చాలని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ ఈ హమీ అమలు దిశగా అధికారులకు అదేశాలు ఇచ్చారు. దీంతో..ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను అధికారులు తొలిగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఓడిన కేసీఆర్ అక్కడి నుంచి ఖాళీ చేసారు. కొత్త సీఎంగా రేవంత్ అధికార కార్యాలయంగా ప్రగతి భవన్ మారనుంది. గతంలో వైఎస్సార్ తరహాలో ప్రజా దర్భార్ నిర్వహణకు రేవంత్ నిర్ణయించారు.

సామాన్యులు సైతం సీఎం కార్యాలయానికి వచ్చే వీలుగా ప్రగతి భవన్ తో పాటుగా సచివాలయంలోనూ మార్పులు చేసారు. ఆంక్షలు తొలిగించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయంలోకి వెళ్లాలన్నా అనుమతి అవసరం అయ్యేది. ఇప్పుడు సాధారణ ప్రజలు సైతం వెళ్లేందుకు వీలుగా మార్పులు చేస్తున్నారు. ప్రగతి భవన్ లో ప్రజలకు అనుమతి లభిస్తుందని రాహుల్ గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే, రేవంత్ ప్రమాణ స్వీకారం తరువాత ఈ భవనానికి పేరు మార్చుతూ..క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారు. ఇక జిల్లాల నుంచి వచ్చే సాధారణ ప్రజలకు సైతం నేరుగా సీఎం కార్యాలయంలో తమ వినతులను ఇచ్చే అవకాశం కలుగుతుంది. దీని ద్వారా ప్రజా ప్రభుత్వంగా తమ పాలన ఉంటుందని రేవంత్ సంకేతాలు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications