హుజురాబాద్ వీరుడికి ఘన స్వాగతం.!విజయోత్సవ ర్యాలీతో బీజేపి కార్యాలయానికి ఈటల.!
హైదరాబాద్ : దాదాపు ఆరు నెలలుగా ప్రజా క్షేత్రంలో ఉండి, ప్రత్యర్ధితో జరిగిన బీకర పోరాటంలో విజయం సాదించి, విజయగర్వంతో సహచరుల వద్దకు చేరుకుంటున్న క్రమంలో బారీ ఘన స్వాగతం పలకాలని, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఎవరికోసమో ఈ పాటికి అర్ధం అయ్యి ఉండి ఉంటుంది. విజయహుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న శాసనసభ్యులు ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శనివారం ఘన స్వాగతం పలుకనుంది. శాసన సభ దగ్గర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఈటల రాజేందర్ మధ్యాహ్నం మూడు గంటలకు నివాళులర్పించిన అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లనున్నారు. అందుకోసం రాష్ట్ర బీజేపి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video
సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర శాఖ ఘనంగా ఈటల రాజేందర్ కు స్వాగతం పలుకుతుంది. అనంతరం రాష్ట్ర కార్యాలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు బీజేపి రాష్ట్ర ముఖ్య నేతలు. బహిరంగ సభలో భారీ ఎత్తున ప్రజలు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో ఈటల రాజేందర్ ను ఘనంగా సన్మానిస్తారు ఇతర బీజేపి నాయకులు. ఈ సన్మాన కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి మరియు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్చార్జిలు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని బీజేపి రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications