ప్రజల మధ్య విభేదాల్లేవ్, గొడవలొద్దు: బాబు-కెసిఆర్‌లకు జవదేకర్
హైదరాబాద్: తెలుగు ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం అన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను పత్రికల్లో చూసినప్పుడు బాధ కలుగుతోందన్నారు.
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. రెండు రాష్ట్రాలు సఖ్యతగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెబుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విభేదాలు పని రాష్ట్రాల కోసం, దేశం కోసం పని చేయాలన్నారు. విభేదాలు కేవలం రాజకీయంగానే ఉన్నాయని, ప్రజల్లో లేదన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సామరస్యంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు, కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాడి అమరులయ్యారన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications