పొట్టలో కొకైన్ దాచుకున్న మూసా ఈమెనే: 14రోజుల కస్టడీకి
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల డ్రగ్స్‌తో పట్టుబడిన దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ మూసా(33)ను అధికారులు బుధవారం రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితురాలు కడుపులో డ్రగ్స్‌తో 4 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ వెలికితీత నిమిత్తం అధికారులు మూసాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 51 డ్రగ్స్ ప్యాకేట్లను వెలికితీయడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 50లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

4 రోజుల చికిత్స ఆ మహిళను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో నార్కొటిక్ అధికారులు నిందితురాలని కోర్టులో హాజరుపరిచారు.
కాగా, మూసాకు 8వ మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది ఇలా ఉండగా, మూసా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications