Special Trains: అయ్యప్ప స్వాములకు శుభవార్త.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
దక్షిణ మధ్య రైల్వే ఆయ్యప్ప స్వాములకు శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కాచిగూడ, నాంపల్లి, మౌలాలీ, కొల్లాం సహా వివిధ ప్రాంతాల మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రైలు నంబర్ 07131/07132 కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ నడుస్తుంది.
ఈ రైళ్లు తెలంగాణలోని మల్కాజ్‌గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, ఏపీలోని నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కాచిపేట, గుట్టలూరులో ఆగుతాయి. సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం, ఎట్టుమనూరు ఆగుతాయి. తిరుగు ప్రయాణంలో ఇదే స్టేషన్లలో రైలు ఆగనుంది. రైలు నంబర్ 07137/07138 హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ నడుస్తుంది.

ఈ రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్, మౌలా అలీ, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, ఏపీలోని నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, నెల్లూరు, గూడూరులో ఆగనున్నాయి. జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం స్టేషన్‌లో హాల్టింగ్ ఉంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే స్టేషన్లలో రైలు అగుతుంది.
రైలు నంబర్ 07141/07142 మౌలాలీ - కొల్లాం - మౌలాలీ మధ్య నడుస్తుంది. తెలంగాణలోని సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్ లో ఆగుతుంది. సీరం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గూటి, యర్రగుంట్ల, రేగుంట్ల, , కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పోదనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనచేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్-ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.












Click it and Unblock the Notifications