హమ్మయ్య... చర్లపల్లికి వెళ్లాల్సిన అవసరం లేని రైళ్లు ఇవే!
వేసవి సెలవులు ముగిసిన పాఠశాలుల, కళాశాలలు తెరుచుకోనుండటంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలో 150 ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీటిపై తగిన ప్రచారం లేక చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లన్నీ ఖాళీగా నడుస్తున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య 16 రైళ్లు నడపబోతున్నారు. దాదాపు నెలరోజులకు పైగా ఇవి నడవనున్నాయి. అదృష్టం ఏమిటంటే ఈ రైళ్లన్నీ సికింద్రాబాద్ నుంచి నడవడమే.
సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ కు
జూన్ 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (నెం. 07041) ప్రతి గురువారం రాత్రి 10:40 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 10:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. జులై నెలలో 3, 10, 17, 24, 30 తేదీల్లో కూడా నడుస్తుంది. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 07:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. జూన్ 13 నుంచి ఆగస్టు1 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC, స్లీపర్, జనరల్, దివ్యాంగుల బోగీలుంటాయి.

విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు
జూన్ ఆరోతేదీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను అధికారులు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇవన్నీ చర్లపల్లి నుంచి నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి వరకు ప్రతి శుక్రవారం ఒక రైలు బయలుదేరుతుంది. జులై 25 వరకు నడుస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంలో జూన్ ఏడోతేదీ నుంచి జులై 26వ తేదీ వరకు చర్లపల్లి నుంచి విశాఖపట్నం వరకు ప్రత్యేక రైలు నడుస్తుంది. వీటికి సరైన ప్రచారం కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో గత నెలలో కూడా రైళ్లన్నీ ఖాళీగా నడిచాయి. దీనివల్ల రైల్వేకు నష్టం ఒనగూరింది. రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చిందని, ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications