ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే దసరా, దీపావళి కానుక.. 48 స్పెషల్ ట్రైన్స్..
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ శుభవార్తను అందించింది. దసరా, దీపావళికి ఊరెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే ఓ కానుకను తీసుకొచ్చింది. పండగల సమయంలో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. అందుకోసం 48 స్పెషల్ ట్రైన్స్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్లతో రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో రైళ్లలో రద్దీ వీపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. సుమారు 48 స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయించుకుంది. ఇవి అక్టోబర్ 10వ తేది నుంచి నవంబర్ 5వ తేది వరకు వేర్వేరు తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

ఈ స్పెషల్ ట్రైన్స్ కాచిగూడ - తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - నాగర్‌సోల్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ - కాకినాడ, తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నయారు. రెగ్యులర్ రైళ్లకు ఇవి అదనపు సర్వీసులు అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వరుస పండగలు వస్తున్న క్రమంలో రైల్వే టికెట్లకు భారీగా డిమాండ్ నెలకొంది.
పట్టణాల్లో ఉండే చాలామంది పండుగలకు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఎక్కువగా రైలు మార్గాలనే ఎంపిక చేసుకుంటుంటారు. దీంతో ట్రైన్ల టిక్కెట్ల డిమాండ్ ఎక్కువయ్యింది. ఈ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications