Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాడ్‌లక్... ఆ రైలు కూడా చర్లపల్లి నుంచే

హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రూ.485 కోట్లకు పైగా ఖర్చుతో ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చిన చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడం ఎలా అనేది ప్రయాణికులను తీవ్రంగా తొలిచేస్తోంది. అందుబాటులో వెంటవెంటనే బయలుదేరేలా సిటీబస్సులను ఏర్పాటు చేశారా? అంటే అదీ లేదు. దీనికితోడు చర్లపల్లి దగ్గర రోడ్లు వెడల్పు చేయలేదు. రైల్వేశాఖ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమన్వయలేమి కనపడుతోంది. ప్రయాణికుల ఇక్కట్లను మాత్రం వారు పట్టించుకోవడంలేదు. అధికారులు మాత్రం రైళ్లమీద రైళ్లను చర్లపల్లి నుంచే ప్రారంభించేస్తున్నారు.

కీలక స్టేషన్లలో హాల్టింగ్
తాజాగా చర్లపల్లి నుంచి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు ప్రత్యేక రైలును ప్రకటించారు దీన్నైనా సికింద్రాబాద్ నుంచి నడుపుతారేమో అనుకుంటే అధికారులు మాత్రం చర్లపల్లి నుంచే ప్రకటించారు. ఈనెల 10, 17, 14 తేదీల్లో 07077 ప్రతి మంగళవారం బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో డెహ్రాడూన్ నుంచి 07078 12, 19, 26 తేదీల్లో ప్రతి గురువారం బయలుదేరతాయి. ఖాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బళార్ష, నాగ్‌పూర్, ఇటార్సి, రాణి కమలాపతి (భోపాల్), భినా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, నిజాముద్దీన్, మేరఠ్, రూర్కీ, హరిద్వార్ లాంటి కీలక స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

South Central Railway starts special trains from Cherlapalli to Dehradun

వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సులు నడపాలి
రోజురోజుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రాధాన్యతను పెంచుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ కన్నా చర్లపల్లి కీలక టెర్మినల్ కావాలనేది అధికారుల యోచనగా ఉంది. అయితే అందుకు తగ్గట్లుగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ నుంచి ఎంఎంటీఎస్ సేవలు నడుపుతుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఎంఎంటీఎస్ లాంటి కనెక్టింగ్ రైళ్లు నడపకుండా మీరంతా చర్లపల్లి వెళ్లండి.. అక్కడినుంచే రైళ్లు నడుస్తాయనడం ప్రయాణికులపై దక్షిణ మధ్య రైల్వేకు ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఇప్పుడైన తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని మిక్కిలి సంఖ్యలో సిటీ బస్సులను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+