ఎస్పీ బాలు 54ఏళ్ల కళాప్రస్థానం - సుగుణాలు నేర్పారన్న విజయశాంతి - తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన
ఎస్పీబీ... ఈ మూడు అక్షరాలు సినిమా పాటలకు ఒక బ్రాండ్ అని, 54 ఏళ్ల సుదీర్ఘ కళా ప్రస్థానంలో జనం నుంచి తాను పొందిన ప్రేమనే ఆయనను కోలుకునేలా చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఉద్దేశించి ఆదివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు ఎస్పీ బాలు చికిత్సకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
చంద్రబాబు వెన్నుపోటుకు 23 ఏళ్ళు - ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తేస్తారా? - విజయసాయిరెడ్డి -అప్పుడేమైందంటే

డాన్స్ చేయించిన శక్తి..
‘‘డాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి... మ్యూజిక్ తెలియనివారితోనూ హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు సొంతం. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది. బాలు గారు, వారి సుదీర్ఘమైన 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజలతో కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను. సౌతిండియన్ సినిమా సాంగ్స్‌కి ఎస్పీబీ పేరు ఒక బ్రాండ్ నేమ్ అనడం అతిశయోక్తి కాదు''అని విజయశాంతి రాసుకొచ్చారు.
అమెరికా ఎన్నికల్లో మోదీ హల్‌చల్ - ట్రంప్ తొలి ప్రచారంలో హైలైట్ - కమలపై కమలం రుసరుస

గాయకుడిగానే కాదు..
ఎస్పీబీ గారు తన గానంతో అలరించడమే గాక... టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకుల్ని ప్రోత్సహించి, వాళ్ళు సినీ రంగంలో నిలదొక్కుకునేలా ఊతమిచ్చారని నటి విజయశాంతి గుర్తుచేశారు. భావితరాలకు వినయ విధేయతల్లాంటి సుగుణాలు కూడా తెలిసేలా తన ప్రవర్తన ద్వారా నేర్పించారని కితాబిచ్చారు. తెలుగువాళ్లతోపాటు తమిళం, కన్నడం, మలయాళం... అలాగే ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా ఎస్పీబీ కోసం ఎదురుచూస్తున్నారని, ఇంతమంది సంకల్పం కచ్చితంగా మళ్ళీ బాలుగారు మనకోసం పాడేలా చేస్తుందని ఆమె ఆకాంక్షించారు.

ఇంకా వెంటిలేటర్ పైనే..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అటక్ నుంచి కటక్ దాకా యావత్ భారతం ఆయన కోసం ప్రార్థిస్తున్నది. ప్రపంచదేశాల్లోని అమానులు సైతం ‘గెట్ వెల్ సూన్' సందేశాలు పంపుతున్నారు. కరోనా బారినపడి చికిత్స పొందుతోన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే, ఆయన ఇప్పటికే వెంటిలేటర్ సపోర్టుపైనే ఉన్నారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు శనివారం నాటి బులిటెన్ లో పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స కూడా అందిస్తున్నాట్లు వైద్యులు తెలిపారు.

ఎస్పీబీ వైద్య ఖర్చలపై..
74 ఏళ్ల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ సోకడంతో గత రెండు వారాలుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందంటూ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ కీలక ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. బాలు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు.