తెరాసలో చేరిన పది మంది టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన పది మంది శాసనసభ్యులకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి నోటీసులు ఇచ్చారు. ఇటీవల తెరాసలో చేరిన ఐదుగురు శాసనసభ్యులకు ఆయన నోటీసులు జారీ చేశారు.
తెరాసలో చేరిన తమ పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేతగా రేవంత్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, వివేకానంద, సాయన్న, రాజేందర్ రెడ్డిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

గతంలో తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగెల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావులకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిపై అప్పుడు టిడిపి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన తెరాసలో చేరారు.
తెరాసలో చేరడమే కాకుండా తమ పది మందిని తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై మధుసూదనాచారి న్యాయనిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖపై ఏం చేయాలనే విషయంపై స్పీకర్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications