బీఆర్ఎస్ ముఖ్య నేత పై సస్పెన్షన్ వేటు..!!
తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగం కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్క సారిగా సభలో దుమారం చెలరేగింది. స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసారు. సభ వాయిదా వేయటంతో మం త్రులు సీఎం రేవంత్ తో చర్చించారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత స్పీకర్ ను అవమానిం చేలా మాట్లాడిన జగదీష్ రెడ్డి పైన వేటు వేయాలని సభ్యులు కోరారు. దీంతో, ఈ సమావేశాల వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు.
జగదీష్ రెడ్డి కామెంట్స్ తో..
తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీసాయి. ఆయన వాఖ్యల పైన కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ సభ్యులు వాదన చేసారు. దీంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను వాయిదా వేశారు.
జగదీశ్ రెడ్డి తన ప్రసంగంలో..' ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీశ్ రెడ్డి అన్నారు. మా అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్గా మీరు కూర్చొన్నారు. అంతేగానీ ఈ సభ మీ సొంతం కాదని..' వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్పీకర్ ను అవమానించటమేనంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు.

స్పీకర్ పై వ్యాఖ్యలతో
ఈ వివాదం పై మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకున్నారు. జగదీశ్ రెడ్డి తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు. అహంకారంతో మాట్లాడుతున్నారని.. క్షమాపణ చెప్పాలని సూ చించారు. స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు సరి కాదని.. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ సైతం క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ వివాదం తో స్పీకర్ సభను వాయిదా వేసారు. మంత్రులు ఢిల్లీలో ఉన్న రేవంత్ కు పరిస్థితిని వివరించారు. సభలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోల ను పరిశీలించారు. జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారని నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయం లో బీఆర్ఎస్ నేతలు స్పందించారు. తమ సభ్యుడి తప్పు లేకపోయినా.. క్షమాపణ చెప్పమని తమ అధినేత కేసీఆర్ ఆదేశించారని చెప్పుకొచ్చారు.
సభ నుంచి సస్పెండ్
తిరిగి సభ ప్రారంభమైన తరువాత కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు. జగదీష్ రెడ్డి స్పీకర్ పైన అను చిత వ్యాఖ్యలు చేసారని.. ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సభలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ భట్టి మరోసారి ప్రస్తావించారు. గతంలో బీఆర్ఎస్ హయాం లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులను తప్పు లేకపోయినా బహిష్కరించిన ఘటనను గుర్తు చేసారు. అయితే, తాము ప్రజాస్వామ్య విధానాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. వెంటనే ఈ సమావేశాల వరకు జగదీష్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెల్లడించారు. ఆ తరువాత బీఆర్ఎస్ సభ్యులు సైతం సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications