శబరిమలకు ప్రత్యేక రైళ్ళు... ఏపీ, తెలంగాణా భక్తులకు శుభవార్త.. ఈ రూట్లలోనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఈనెల 17,24 తేదీలలో ప్రత్యేక రైలు నడపనున్నట్టు పేర్కొంది. 07131నెంబర్ గల రైలు కాచిగూడలో ఆదివారం 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరి, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా కొట్టాయం చేరుకుంటుంది.
శబరిమలకు ప్రత్యేక రైళ్ళు
ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈనెల 18, 25వ తేదీలలో కొట్టాయంలో బయలుదేరి తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, నడికుడి మీదుగా కాచిగూడ చేరుకుంటుందని పేర్కొన్నారు. అంతేకాదు 15, 22, 29 తేదీలలో శబరిమలకు ప్రత్యేక రైలు 07137 హైదరాబాదులో బయలుదేరి నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా కొట్టాయం కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఏపీలోని ఈ స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్ళు
ఇక ఈ రైలు తిరుగు ప్రయాణంలో 07138 ఈనెల 16, 23, 30 తేదీలలో కొట్టాయం నుండి బయలుదేరి తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, నడికుడి మీదుగా సికింద్రాబాద్ కు చేరుకుంటుందని వెల్లడించారు. మరో ప్రత్యేక రైలు 07133/ 07134 నవంబర్ 18, 25 తేదీలలో కాచిగూడ కొట్టాయం కాచిగూడ షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా వెళుతుందని పేర్కొన్నారు.
తెలంగాణా నుండి కూడా ఈ స్టేషన్ల మీదుగా రైళ్ళు
ఇక మరో రైలు మౌలాలి కొల్లాం మౌలాలి 07141/07142 సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్ పల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాదగిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లో ఆగుతుందని వెల్లడించారు. ఇక రైలు నెంబరు 07139/07140 నాందేడ్ కొల్లం సికింద్రాబాద్ నాందేడ్ లో నవంబర్ 16వ తేదీన బయలుదేరుతుందని, నవంబర్ 18వ తేదీన కొట్టాయంలో బయలుదేరుతుందని వెల్లడించారు.
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం పలు ప్రత్యేక రైళ్లతో రైల్వే సేవలు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి శబరిమలకు వెళ్లే భక్తుల కోసం పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి రైల్వే సేవలను అందిస్తోంది. ప్రతీ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు శబరిమలకు వెళ్లనున్న నేపధ్యంలో వారి సౌకర్యార్ధం రైల్వే ఈ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications