వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఫ్ తింటే బేవకూఫ్ అని చెప్పారు: ఓయూ ఫెస్టివెల్‌పై పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ నెల పదో తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివెల్ ఉపసంహరించుకోవాలని శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శనివారం నాడు విజ్ఞప్తి చేశారు. కహానావాదులు చెప్పే మాయమాటలు నమ్మి, ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు.

పాలు ఇచ్చే ఆవు దైవంతో సమానమని, బీఫ్ తింటే బుద్ధిమాంద్యం వస్తుందన్నారు. బీఫ్ ఫెస్టివెల్‌ను నిర్వహించే రోజు తాము గోరక్ష దివస్‌గా ప్రకటిస్తున్నామన్నారు. ప్రాచీన వేదకాలం నాటి అంశాలను చెబితే ఇక్కడి వారు పట్టించుకోరని, అదే అమెరికా, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్లు చెప్తే నిజమంటారని ఎద్దేవా చేశారు.

బీఫ్ ఫెస్టివెల్ వద్దని, కేవలం పండుగలు జరుపుకుందామని కోరారు. పదో తేదీన లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న భాగ్యనగర్ గోరక్ష సమితి ఆధ్వర్యంలో గోవులకు పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదే సమయంలో రాష్టవ్య్రాప్తంగా అందరూ గోవులను పూజించి గో రక్షణకు సంకల్పించాలని కోరారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరిపూర్ణానంద స్వామి ఘాటుగా స్పందించారు.
భారతీయుల సంస్కృతీ సంప్రదాయాల్లో గోవుకు విశిష్ట స్థానం కల్పించారని, అలాంటి గోవును బహిరంగంగా వధించి వండుకుని తింటామనడం యావత్ హిందూ జాతిని, వారి మనోభావాలను ఘోరంగా దెబ్బతీయడమేనన్నారు.

బీఫ్ తిన్న వాడు బేవకూఫ్ అని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొందన్నారు. బీఫ్ విషపూరితమైనదని, దానిని తింటే కొలోనల్ క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, మహిళల్లో హార్మోన్లలో సమతుల్యత దెబ్బతిని రొమ్ముక్యాన్సర్లు వంటి రోగాలు సంక్రమిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలో పేర్కొందన్నారు.

Sri Paripoornananda Saraswati Swami Serious Statement on beef festival

కంచె ఐలయ్య వంటి వారు మూర్ఖంగా ప్రవర్తిస్తూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారని, ఒక ప్రొఫెసర్‌గా ఆయనకు ఇది తగదన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, యువతను భ్రష్టు పట్టించే విధంగా ఇలాంటివి విశ్వవిద్యాలయంలో నిర్వహించడాన్ని ప్రతి ఒక్క హిందువు వ్యతిరేకించాలన్నారు.

ఎవరైనా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడాలంటే అటువంటి వారు ఏ పాకిస్తానో, ఆప్ఘనిస్తాన్ గానీ వెళ్లి మాట్లాడాలని ఆయన పరోక్షంగా మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి అన్నారు.

విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ఒవైసీ సోదరులిద్దరికీ నేను ఒకటే చెబుతున్నా మీరు లండన్‌లోనో ఎక్కడో చదువుకుని వచ్చారు, ఇలా ఒకరి సంస్కృతిని దెబ్బతీసి సమాజాన్ని భ్రష్టు పట్టించే విధానాలు మానుకోవాలని హితవు పలికారు.

గోవధ అంటే భూవధే అవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. గతంలో చక్రవర్తులు గోవులను రక్షించి చరిత్రకెక్కారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా గోవధను ఆపి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరిపూర్ణానంద విజ్ఞప్తి చేశారు.

English summary
Sri Paripoornananda Saraswati Swami Serious Statement on beef festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X