హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభయాత్ర: ‘గొంతుపై కాలేసి ‘భారత్ మాతా కీ జై’ అనిపిస్తాం-ఐసీస్‌తో చర్చలు జరపాలా?’

హైదరాబాద్ నగరంలో ప్రతియేటా శ్రీరామనవమి రోజున జరిగే శోభయాత్ర ఈసారి కూడా వైభవోపేతంగా సాగింది. ఈ శోభయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం సీతారాంభాగ్‌లో ప్రారంభమైన శోభయాత్ర..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ప్రతియేటా శ్రీరామనవమి రోజున జరిగే శోభయాత్ర ఈసారి కూడా వైభవోపేతంగా సాగింది. ఈ శోభయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం సీతారాంభాగ్‌లో ప్రారంభమైన శోభయాత్ర.. రాత్రి 9గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ప్రశాంతంగా ముగిసింది. యాత్ర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

గొంతుపై కాలు పెట్టి..

గొంతుపై కాలు పెట్టి..

భారత్‌మాతాకీ జై అనని వారికి దేశంలో చోటులేదని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ స్పష్టం చేశారు. అలా అనని వారి గొంతులపై కాళ్లు పెట్టి ‘భారత్ మాతాకీ జై' అనిపిస్తామన్నారు.

భారత మాత అంటే కన్న తల్లి..

భారత మాత అంటే కన్న తల్లి..

భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి హనుమాన్ వ్యాయామశాల పాఠశాలలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మాత అంటే కన్నతల్లి అని, దేశ భక్తులకే ఇక్కడ చోటు ఉంటుందన్నారు.

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు..

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు..

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు, అక్కడే రామ మందిరం నిర్మించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా స్పష్టంచేశారు. కార్యక్రమంలో 1008 మహా మండలి బ్రిజ్‌భూషణ్‌దాస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంత్‌రావు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు గోవింద్‌రాఠి, వీహెచ్‌పీ భజరంగ్‌దళ్ ప్రతినిధులు రామరాజు, భానుప్రకాష్, లక్ష్మణ్‌రావు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

రామరాజ్యం..

రామరాజ్యం..

దేశంలో రామరాజ్య స్థాపన మొదలైందని.. అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతామని అని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌భాయ్‌ తొగాడియా అన్నారు. రామమందిరం విషయంలో ఒక్క అడుగు కూడా పక్కకు జరగమని, దీన్ని అడ్డుకునే వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బాబ్రీ స్మారక చిహ్నానికి అక్కడ అవకాశాల్లేవని చెప్పారు.

ఐసీస్‌తో చర్చించాలా..?

ఐసీస్‌తో చర్చించాలా..?

గతపాలకుల నిర్వాకం వల్లే ఆయోధ్యలో రామమందిరం నిర్మించలేకపోయామని తొగాడియా అన్నారు. ‘ఇటీవల కొందరు అయోధ్య వివాదాన్ని పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోండి అంటున్నారు.. రామమందిరం గురించి ఐసిస్‌ ఉగ్రవాదులు, దేశద్రోహులతో చర్చించాలా?' అని ప్రశ్నించారు. దీనికి అసలు చర్చలే అవసరం లేదన్నారు.

దోపిడీదారుకు స్మారకలా..?

దోపిడీదారుకు స్మారకలా..?

మంగోలియా నుంచి వచ్చిన బాబర్‌ మనదేశాన్ని దోచుకున్నాడని అతడికి ఈ దేశంలో స్మారక నిర్మాణాలు ఎందుకని ప్రశ్నించారు. ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు స్వయంగా ప్రపంచానికి సనాతన వైదిక హిందూ ధర్మమని తెలిపారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరగుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు హిందువులంతా చైతన్యవంతులై శక్తిగా మారి ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. భగవంతుడు రాముడు పుట్టిన ప్రదేశంలో మనం పుట్ట డం అదృష్టమని అన్నారు. ప్రపంచంలో హిందూ ధర్మంలోనే యాగాలు, యజ్ఞాలు చే సే అవకాశం కలిగి ఉందన్నారు. భారతదేశంలోనే దేవుళ్లకు ఆలయాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే గోమాతకు సేవచేసే సంస్కృతి హిందూ ధర్మంలోనే ఉందన్నారు. పుర్వజన్మలో చేసిన కర్మ లు నాశనం చేసే శక్తి హిందుధర్మానికే ఉందని, హిందూ ధర్మంతోనే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, మానసిక ప్రశాంతత కలుగుతాయని ఆయన అన్నారు. ముస్లింలు.. హిందువులు చెల్లిస్తున్న పన్నుల వల్లే హజ్‌యాత్రకు రాయితీలతో వెళ్తున్నారని, వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

రాముడి జన్మభూమి కోసమే..

రాముడి జన్మభూమి కోసమే..

యోధ్యలో తమ పోరాటం ఒక మందిరం కోసం కాదని, రాముడి జన్మభూమి కోసమేనని తొగాడియా స్పష్టం చేశారు. అయోధ్యలో బాబర్ పేరు లేదని, అక్కడ మసీదు నిర్మించనివ్వమని స్పష్టం చేశారు. ప్రధాని చూసి పలు ముస్లిం దేశాలు కూడా ఆలయాల నిర్మాణానికి స్థలాలిస్తున్నాయని, అందుకే భారతదేశం బలపడితేనే ముస్లిం దేశాలు కూడా బలపడుతాయన్నారు.

దళితులతో స్నేహం..

దళితులతో స్నేహం..

యాదాద్రి, భువనగిరి ప్రాంతాల్లో కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన దళితులతో కార్యకర్తలు స్నేహంగా మెలగాలని సూచించారు. శ్రీశ్రీ శ్రీ కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ.. దేశ, దైవభక్తి కల్గి ఉన్నవారే గొప్పవారవుతారన్నారు. సమాజంలో హిందూవుల గౌరవం పెరిగితేనే ముస్లిం, క్రైస్తవుల గౌరవం కూడా పెరుగుతుందన్నారు.

ఏకం కావాలి..

ఏకం కావాలి..

ప్రపంచంలోని హిందువులంతా సంఘటితమై హిందూ రాష్ట్ర ఏర్పాటుకు సన్నద్ధం కావాలని ప్రవీణ్ భాయ్ తొగాడియా పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పెద్దచెర్వువద్దగల శ్రీపచ్చలకట్ట సోమేశ్వరాలయం, నల్లగొండ చౌరస్తాలో గల శ్రీసీతారామ లక్ష్మణాలయం, గంజ్ ఠాగూర్‌రోడ్‌లో గల శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయాలలో నిర్వహించిన శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

English summary
Sri Rama Navami Shobha Yatra, which started at Seetharambagh on Wednesday afternoon culminated at Hanuman Vyayama Shala in Koti around 9 pm peacefully.Police made elaborate bandobust arrangements for all the 200 independent processions that took place at different parts of the city and culminated at Koti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X